Praggnanandhaa: ప్రజ్ఞానంద విజయాల్లో అమ్మ పాత్ర అద్భుతం.. విదేశాలకు స్టవ్‌ తీసుకెళ్లి మరీ

ఇదిలా ఉంటే ఫైనల్‌లో గెలుపొటములను పక్కన పెడితే ఇప్పుడు ప్రజ్ఞానంద్‌ గురించి దేశ ప్రజలంతా తెగ వెతికేస్తున్నారు. 18 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు ఇంత అద్భుతం ఎలా సాధించాడని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజ్ఞానంద విజయం వెనకాల అతడి తల్లి కృషి కూడా ఎంతో ఉందని మీకు తెలుసా.? ప్రజ్ఞాన్‌కు నిత్యం వెన్నంటి ఉండి అండగా నిలిచిన ఆమె తల్లి నాగ లక్ష్మీ...

Praggnanandhaa: ప్రజ్ఞానంద విజయాల్లో అమ్మ పాత్ర అద్భుతం.. విదేశాలకు స్టవ్‌ తీసుకెళ్లి మరీ
Prajnananda
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 24, 2023 | 8:24 PM

ప్రజ్ఞానంద ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగుతోంది. చెస్‌ ప్రపంచకప్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న ఈ యంగ్‌ ఛాంపియన్‌ యావత్ దేశాన్ని ఒక్కసారి తనవైపు తిప్పుకున్నాడు. దీంతో ఫైనల్‌లోనూ గెలుస్తాడని అంతా ఆశించారు, కానీ ప్రపంచ నెంబర్‌ వన్ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ విజేతగా నిలిచాడు. అయితేనేం ఒక 18 ఏళ్ల కుర్రాడు ప్రపంచ నెంబర్‌ వన్‌ చెస్‌ ఛాంపియన్‌గా ముచ్చెమటలు పట్టించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సరదాగా ఆడాడు. మెదటి రెండు గేమ్స్‌లో డ్రా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇదిలా ఉంటే ఫైనల్‌లో గెలుపొటములను పక్కన పెడితే ఇప్పుడు ప్రజ్ఞానంద్‌ గురించి దేశ ప్రజలంతా తెగ వెతికేస్తున్నారు. 18 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు ఇంత అద్భుతం ఎలా సాధించాడని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజ్ఞానంద విజయం వెనకాల అతడి తల్లి కృషి కూడా ఎంతో ఉందని మీకు తెలుసా.? ప్రజ్ఞాన్‌కు నిత్యం వెన్నంటి ఉండి అండగా నిలిచిన ఆమె తల్లి నాగ లక్ష్మీ అతడి విజయంలో కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

తల్లి తీసుకున్న నిర్ణయంతో..

నిజానికి ప్రజ్ఞానంద చెస్‌ రంగంలోకి రావడానికి అతని సోదరి వైశాలి కారణం. వైశాలి కూడా చెస్‌ మాస్టరే. చిన్నప్పుడు వైశాలి టీవీ ఎక్కువ చూస్తుండేది. దీంతో టీవీని మాన్పించడానికి తల్లి చెస్‌ గేమ్‌ను అలవాటు చేసింది. సోదరి ఆడుతుండగా చూసిన ప్రజ్ఞానందకు చెస్‌పై ఆసక్తి కలిగింది. అక్కతో ఆడుకుంటున్న సమయంలోనే చెస్‌ను నేర్చుకున్నాడు. అనంతరం ప్రజ్ఞానందాను చెస్‌ కోచ్‌ దగ్గర చేర్పించారు. దీంతో 10 ఏళ్ల వయసులోనే ప్రజ్ఞా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా ఎదిగాడు.

ఎక్కడికి వెళ్లినా తల్లి ఉండాల్సిందే..

ప్రజ్ఞానంద్‌ చెస్‌ ఆడడానికి ఎక్కడికి వెళ్లినా వెంట తల్లి నాగలక్ష్మి ఉండేది. కోచింగ్ మొదలు టోర్నీల వరకు అన్ని చోట్లకు ప్రజ్ఞా వెంటనే ఉండేది నాగలక్ష్మి. విదేశాల్లో జరిగే టోర్నమెంట్‌లకు వెళ్లే సమయంలో ప్రజ్ఞానందకు ఇంటి భోజనం దూరం కాకూడదని నాగ లక్ష్మి భావించింది. దీంతో ప్రజ్ఞానంద్‌ ఎక్కడికి వెళ్లినా వెంట స్టవ్‌తో పాటు రైస్‌ కుక్కర్‌ను తీసుకెళ్తుంటారు. వాటితో ప్రజ్ఞాన్‌కు ఇష్టమైన రసం, సాంబార్‌ వంటివి స్వయంగా వండి పెడుతుంటారు. ఇలా ప్రజ్ఞాన్‌ విజయంలో తల్లి నాగలక్ష్మి ఎంతో కీలక పాత్ర పోషించారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు తల్లి నాగలక్ష్మిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..