Viral Video: గురుడు దొరికాడండోయ్.. ఇద్దరమ్మాయిలతో స్టంట్లు చేసిన యువకుడికి.. ఇక పచ్చడేనట..!

|

Apr 03, 2023 | 9:08 AM

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో బైక్ స్టంట్ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ముందు ఒక అమ్మాయి.. వెనుక అమ్మాయిని కూర్చొబెట్టుకున్న యువకుడు.. రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ కనిపించాడు.

Viral Video: గురుడు దొరికాడండోయ్.. ఇద్దరమ్మాయిలతో స్టంట్లు చేసిన యువకుడికి.. ఇక పచ్చడేనట..!
Viral
Follow us on

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో బైక్ స్టంట్ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ముందు ఒక అమ్మాయి.. వెనుక అమ్మాయిని కూర్చొబెట్టుకున్న యువకుడు.. రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యింది.. హెల్మెట్ లేకుండా..రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ముంబై పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు యువకుడిని పట్టుకున్నారు.

ఇద్దరు బాలికలతో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన 24 ఏళ్ల యువకుడిని ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితుడిపై అంతకుముందే పలు కేసులున్నట్లు వెల్లడించారు. నిందితుడు హిస్టరీ షీటర్.. అతనిపై ఆంటోప్ హిల్, వడాలా టిటి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు ప్రకటనలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

“ఇటీవల, నిందితుడు తన బైక్‌పై ఇద్దరు అమ్మాయిలతో ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో జరిగింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, కేసు నమోదు చేశాం.. అతన్ని పట్టుకునేందుకు ఒక బృందం సైతం ఏర్పాటు చేశాం” అని ముంబై పోలీసు అధికారి తెలిపారు.

పక్కా సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ శిక్షాస్మృతి (IPC) 308, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్లతో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..