S Jaishankar: వారికి ఓ దురలవాటు ఉంది.. అది దేవుడిచ్చిన ప్రత్యేక అర్హత.. జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు..

|

Apr 03, 2023 | 9:32 AM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు విషయంపై అమెరికా, జర్మనీ సహా పలు దేశాలు స్పందించిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాల తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

S Jaishankar: వారికి ఓ దురలవాటు ఉంది.. అది దేవుడిచ్చిన ప్రత్యేక అర్హత.. జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు..
S Jaishankar
Follow us on

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు విషయంపై అమెరికా, జర్మనీ సహా పలు దేశాలు స్పందించిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాల తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పాశ్చాత్య దేశాలకు ఉన్న దురలవాటంటూ జైశంకర్ ఫైర్ అయ్యారు. బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్య నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అనర్హతపై మాట్లాడుతున్న దేశాలకు చురకలంటించారు. ఇతరుల వ్యవహారాల గురించి మాట్లాడటం పాశ్చాత్య దేశాలకు ఉన్న దురలవాటని.. అది దేవుడు వారికిచ్చిన ప్రత్యేక అర్హతగా భావిస్తారంటూ మండిమడ్డారు. ఈ విషయాన్ని వారు అనుభవం ద్వారానే తెలుసుకోవాలని.. వారు ఇతరులు విషయాల్లో మాట్లాడుతుంటే.. వారి గురించి కూడా ఇతరులు మాట్లాడతారంటూ ఫైర్ అయ్యారు. మనం కూడా మారాల్సి ఉందని.. మన సమస్యల గురించి మాట్లాలంటూ కొందరు చెప్పడం మానుకోవాలని సూచించారు.

ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపైనా జైశంకర్ ఈ సందర్భంగా స్పందించారు. ప్రస్తుతం ఉన్నది ఉచిత పథకాల సంస్కృతంటూ పేర్కొన్న జైశంకర్.. వాటిపై ఆధారపడి దేశాన్ని నడిపించలేమంటూ పేర్కొన్నారు. ఉచిత పథకాలు త్వరగా ప్రజాదరణ పొందడానికి ఉపయోగపడతాయని.. అయితే, ఉచితాలను ఇస్తున్నారంటే మరోచోట దానికోసం ఇంకొకరు చెల్లిస్తున్నట్లుగానే భావించాలంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ పై సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఉన్న కొందరు ఈ ఉచితాల సంస్కృతికి మాస్టర్లు అంటూ జైశంకర్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..