Karnataka: తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కొడుకు.. బోరుబావిలోంచి శరీర భాగాలు..

నిందితుడిని విఠల కులాలిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీ సులు  జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. డిసెంబరు 6న ఈ దారుణ సంఘటన జరిగినట్టుగా తెలిసింది.

Karnataka: తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కొడుకు.. బోరుబావిలోంచి శరీర భాగాలు..
Murder
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 13, 2022 | 7:15 PM

దేశరాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలంరేపిన శ్రద్దా హత్య కేసు ఘటన మరువక ముందే.. కర్ణాటకలో కూడా అలాంటి కేసు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని బాగల్‌కోట్‌లో ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేసి మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ ముక్కలను ఒక ఓపెన్‌ బోరుబావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాం ముక్కలను వెలికితీశారు. నిందితుడిని విఠల కులాలిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీ సులు  జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. డిసెంబరు 6న ఈ దారుణ సంఘటన జరిగినట్టుగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బాగల్‌కోట్‌కు చెందిన నిందితుడు విఠల వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న తన 54 ఏళ్ల తండ్రి పరశురాం కులాలిని సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బైపాస్ సమీపంలోని వ్యవసాయ భూమికి తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. మద్యం మత్తులో పరశురామ్‌ తరచూ ఇంట్లో గొడవపడుతుండే వాడని తెలిసింది. ఆయన భార్య, పెద్ద కుమారుడు వేర్వేరుగా ఉంటున్నారు. గత మంగళవారం కూడా మద్యం మత్తులో తండ్రి తనపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన నిందితుడు ఇనుప రాడ్‌తో తండ్రిని హతమార్చాడని తేలింది.

హత్య అనంతరం నిందితుడు తండ్రి మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికేశాడు. అనంతరం బాగల్‌కోట్‌ జిల్లా ముధోల్‌ శివారులోని మంటూరు బైపాస్‌ సమీపంలోని తన పొలంలో ఉన్న ఓపెన్‌ బోర్‌వెల్‌లో శరీర భాగాలను పడేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి