అయ్యో పాపం.. నాలుగు రోజుల పసికందు ప్రాణాలు తీసిన పోలీసు బూటు కాళ్లు..!
జార్ఖండ్ లోని గిరిడి జిల్లాలో దారుణం జరిగింది. పోలీసు కానిస్టేబుల్ నాలుగు రోజుల పసికందును తొక్కినట్లు ఆ పాప కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాలుతో తొక్కడంతో అక్కడిక్కడే తమ బిడ్డ మరణించదని ఆవేదన వ్యక్తం చేశారు.
జార్ఖండ్ లోని గిరిడి జిల్లాలో దారుణం జరిగింది. పోలీసు కానిస్టేబుల్ నాలుగు రోజుల పసికందును తొక్కినట్లు ఆ పాప కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాలుతో తొక్కడంతో అక్కడిక్కడే తమ బిడ్డ మరణించదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భూషన్ పాండే అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే చాలా రోజుల నుంచి పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే తాజాగా భూషన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. తెల్లవారు జామున 3.20 AM సమయంలో పోలీసులు అతని ఇంటికి రాగానే వారిని చూసి భూషన్ పాండే, అతని కుటుంబ సభ్యులు పారిపోయారు. వారు వెళ్లిపోయాక ఇంటికి వెళ్లి చూస్తే తమ 4 రోజుల పసికందు విగతజీవిగా పడి ఉంది. తమ బిడ్డ గదిలో నిద్రిస్తుండగా పోలీస్ కానిస్టేబుల్ తొక్కడం వల్లే మరణించిందని భూషన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భూషన్ పాండే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడం వల్ల అది కాస్తా వైరల్ గా మారింది. అయితే ఆ పోలీసు కానిస్టేబుల్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే భూషన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా స్పందించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
ఆరుగురి పోలీసులపై ఎఫ్ఐఆర్..
ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వీరిలో ఐదుగురిని ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రెండు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను అందజేసేందుకు పోలీసులు అక్కడకు వెళ్లినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..