Corona Alert: దేశంలో మరోసారి కరోనా అలజడి.. హైఅలర్ట్‌ ప్రకటించిన కేంద్రం.. ఆ రెండు రోజుల్లో.

దేశంలో మరోసారి కరోనా అలజడి రేపుతోంది. దేశంలో ఒక్కసారిగా కరోనా కేసుల్లో పెరుగదల కనిపించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది...

Corona Alert: దేశంలో మరోసారి కరోనా అలజడి.. హైఅలర్ట్‌ ప్రకటించిన కేంద్రం.. ఆ రెండు రోజుల్లో.
Corona Virus
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 25, 2023 | 5:33 PM

దేశంలో మరోసారి కరోనా అలజడి రేపుతోంది. దేశంలో ఒక్కసారిగా కరోనా కేసుల్లో పెరుగదల కనిపించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు హెచ్చరికాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే సోమవారం రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది.

కేసులు ఉన్నపలంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు నమోదుకాగా, వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత ఐదువారాల్లో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్‌ ‘టీ’ (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌-టీకా)పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16 సబ్‌వేరియంట్‌గా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో శుక్రవారం 152 కొత్త కరోనావైరస్ కేసులు 6.66 శాతం పాజిటివ్ రేటుతో నమోదయ్యాయి. అంతకుముందు అక్టోబర్‌లో ఢిల్లీలో ఒకే రోజులో 100 కేసులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలోనూ శుక్రవారం 343 కొవిడ్‌ కేసులు నమోదవగా.. ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,763కి చేరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..