Selfie Effect: సెల్ఫీ ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా.. సెల్ఫీ దిగుతూ 120 అడుగుల లోతున్న లోయలో పడిపోయిన పెళ్లికూతురు

కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్‌ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 9న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు.

Selfie Effect: సెల్ఫీ ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా.. సెల్ఫీ దిగుతూ 120 అడుగుల లోతున్న లోయలో పడిపోయిన పెళ్లికూతురు
Bride Falls In Quarry Pond
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2022 | 12:12 PM

ఇటీవల జనాలకు సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఊ అంటే సెల్ఫీ.. ఆ అంటే సెల్ఫీ.. ఈ సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ సెల్ఫీ కారణంగా నాలుగురోజుల్లో పెళ్లి చేసుకొని హాయిగా గడపాల్సిన వధూవరులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన కేరళలో జరిగింది. అసలేం జరిగిందంటే..

కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్‌ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 9న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ క్రమంలో వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించి, అనంతరం దగ్గర్లోని అయిరవల్లి క్వారీని చూసేందుకు వెళ్లారు. అక్కడ వధూవరులిద్దరూ సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. అనుకుందే తడవుగా క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకోడానికి రెడీఅయ్యారు. క్వారీ అంచున నిల్చున్న వధువు అదుపుతప్పి 120 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. తన కాబోయే భార్య కళ్లముందే అలా పడిపోయేసరికి మరో ఆలోచన లేకుండా వరుడు కూడా దూకేసాడు. నీటిలో మునిగిపోతున్న వధువును కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకొని ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్పగాయాలతో బయటపడ్డ వధూవరులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో డిసెంబర్‌ 9న వైభవంగా జరగాల్సిన వివాహం కాస్తా వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..