Sleeping Pattern: అలర్ట్.. ఈ వైపు నిద్రపోతే కడుపు, గుండె సమస్యలు పెరుగుతాయి..!

మన ఆరోగ్యం మన నిద్రపైనే ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర ఉంటే.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర పోవడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. దీని కారణంగా మరుసటి రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. అయితే, రాత్రిపూట మనం పడుకునే పొజిషన్ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును, ఎడవైపు పడుకుంటే ఏం జరుగుతుంది?

Sleeping Pattern: అలర్ట్.. ఈ వైపు నిద్రపోతే కడుపు, గుండె సమస్యలు పెరుగుతాయి..!
మంచి నిద్ర: రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు మంచిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఉదయం లేవగానే రీఫ్రెష్‌ మోడ్‌లో కూడా ఉంటారు. ఈ కారణంగానే చాలా మంది నిద్రించే ముందు వేడినీళ్లు తాగుతుంటారు.
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 27, 2023 | 8:10 AM

మన ఆరోగ్యం మన నిద్రపైనే ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర ఉంటే.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర పోవడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. దీని కారణంగా మరుసటి రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. అయితే, రాత్రిపూట మనం పడుకునే పొజిషన్ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును, ఎడవైపు పడుకుంటే ఏం జరుగుతుంది? కుడివైపు పడుకుంటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ఎలాంటి అనారోగ్యాలు ఉంటాయి? వంటి ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. జీర్ణక్రియపై ప్రభావం..

కుడివైపు ఎక్కువగా నిద్రపోతే.. ఈరోజే ఈ అలవాటును మార్చుకోండి. కుడివైపు కాకుండా ఎడమవైపు పడుకోవడం వల్ల పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా సరిగ్గా జరుగుతుంది. ఎడమ వైపు నిద్రిస్తున్నప్పుడు పొట్ట, ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేస్తాయి. శరీరంలోని వ్యర్థ పదార్థాలు ఈజీగా బయటకు వెళ్లిపోతాయి. దీంతో పాటు.. యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

2. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ గుండెపై ఎలాంటి ఒత్తిడిని కలిగించదు. దీని వల్ల గుండెకు రక్తం సరిగ్గా చేరుతుంది. గుండె శరీరం ఎడమ వైపున ఉంటుంది. అందుకే ఎడమవైపు నిద్రించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

3. ఆక్సిజన్, రక్తం శరీర అవయవాలకు సరిగ్గా చేరుతుంది..

ఎడమ వైపున నిద్రించడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలకు, మెదడుకు రక్తం, ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. హృదయం ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి.

4. వెన్నునొప్పి నుండి ఉపశమనం..

వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే.. ఎడమ వైపున పడుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఈ స్థితిలో వెన్నుపాముకు సపోర్ట్ ఉంటుంది. దీని కారణంగా వెనుకభాగంలో తక్కువ భారం పడుతుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..