Beauty Tips: మృదువైన, మెరిసే చర్మానికి బొప్పాయి నూనె దివ్యౌషధంలాంటిది.. ఎలా ఉపయోగించాలంటే..!

మొదట పాలు, ఆ తర్వాత మంచినీటితో కడిగి చూడండి చర్మం కాంతులీనుతుంది. ఇలా ప్రతిరోజూ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Beauty Tips: మృదువైన, మెరిసే చర్మానికి బొప్పాయి నూనె దివ్యౌషధంలాంటిది.. ఎలా ఉపయోగించాలంటే..!
పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఫేస్ సీరమ్‌లో హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ వంటి పదార్థాలను కలిగి ఉన్న సీరమ్‌ను ఉపయోగించాలి. మీ ముఖం కడిగిన తర్వాత, సీరమ్‌ను ముఖం, మెడపై బాగా రాయాలి.
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2022 | 12:36 PM

మృదువైన, మెరిసే చర్మానికి బొప్పాయి నూనె.. చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి నూనెను దీని గింజలతో తయారు చేస్తారు. బొప్పాయి పండు మాత్రమే కాదు.. బొప్పాయి నూనె కూడా ఆరోగ్య ప్రదాయినిగా చెప్పాలి. చర్మ సౌందర్యానికి బొప్పాయి నూనె దివ్వౌషధంగా పనిచేస్తుంది. మృదువైన, మెరిసే చర్మానికి బొప్పాయి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది.. బొప్పాయి నూనెను బొప్పాయి గింజలతో తయారు చేస్తారు. ఈ నూనెలో ప్రోటీయోలైటిక్ ఎంజైములు, ఒమేగా 6, ఒమేగా 3, విటమిన్లు ఉంటాయి. మీరు ఏవైనా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, బొప్పాయి నూనె మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి బొప్పాయి నూనె వాడకం, ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ముందుగా అరచేతులపై కొన్ని చుక్కల బొప్పాయి నూనెను వేసుకోవాలి. దీన్ని మీ చర్మంపై అప్లై చేసి చేతులతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.. బొప్పాయి నూనె చర్మంలోకి బాగా పట్టేవిధంగా కాసేపు ఆరనియాలి.. దీంతో మీ చర్మం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం దానంతటదే మెరుపును సంతరించుకుంటుంది.

బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ చర్మంపై నేరుగా చికిత్స చేసినప్పుడు చర్మం రికవరీ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. విటమిన్ ఎ, పాపైన్ ఉండటం వల్ల చర్మాన్ని పోషణ, హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బొప్పాయి నూనె ముఖంపై ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది.. దీని నూనెతో బ్లాక్ హెడ్స్, మొటిమల మరకలు కూడా తొలగిపోతాయి. ఇది కాకుండా, బొప్పాయి నూనెను ఉపయోగించడం వల్ల గాయాలు త్వరగా మానేందుకు సహకరిస్తుంది.

బొప్పాయి నూనెలో ఉండే యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ మన ముఖంపై ముడతలను పోగొట్టడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ నూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మన ముఖంలోని డల్ నెస్ తగ్గడమే కాకుండా చర్మంలోని డార్క్ నెస్ కూడా తొలగిపోతుంది.

బొప్పాయి నూనె చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కూడా పనిచేస్తుంది. దీని కారణంగా చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోతుంది. మన చర్మం అదనపు నూనె కూడా సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా జిడ్డుగల చర్మం కోసం బొప్పాయి నూనెను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

బొప్పాయి పండుతో చేసే మరో ప్రయత్నం మీ ముఖ సౌందర్యాన్ని మరింత నిగారింపజేస్తుంది. అందుకోసం ముందుగా, బొప్పాయి గుజ్జును ఒక గిన్నెలో తీసుకుని అందులో తేనె వేసి, ఆపై దానిని చేతులతో సున్నితంగా ముఖంపై ఐదు నిమిషాల పాటు రుద్దండి. మొదట పాలు, ఆ తర్వాత మంచినీటితో కడిగి చూడండి చర్మం కాంతులీనుతుంది. ఇలా ప్రతిరోజూ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి