Benefits of onion: ఒత్తైన, అందమైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..?

చలికాలంలో జుట్టులో చుండ్రు మొదలవుతుంది. జుట్టు కూడా వేగంగా రాలిపోతుంది. జుట్టు నిపుణుల అభిప్రాయం ప్రకారం,..

Benefits of onion: ఒత్తైన, అందమైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..?
Benefits Of Onion
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2022 | 9:14 AM

వంటకాలలో ఉల్లిపాయల వాడకం సర్వసాధారణం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. సీజనల్ వ్యాధులపై కూడా ఉల్లిపాయ ప్రభావం చూపుతుంది. దీని రసాన్ని జ్వరంలో ఉపయోగిస్తారు. చలికాలంలో తలలో చుండ్రు, జట్టు సమ్యలు  మొదలవుతుంది. జుట్టు కూడా వేగంగా రాలిపోతుంది. జుట్టు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉల్లిపాయ రసం జుట్టు రాలడం, చుండ్రును వదిలించుకోవడానికి పనిచేస్తుంది.

ఉల్లిపాయ రసం శీతాకాలంలో చుండ్రు, జుట్టు రాలడానికి వ్యతిరేకంగా బాగా పనిచేస్తుంది. జుట్టు సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తేనె, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం వల్ల ఈ జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు. ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. దాని రెగ్యులర్ వాడకంతో జుట్టును మెరుస్తూ, ఒత్తుగా ఉంచుతుంది.

నిమ్మ మరియు ఉల్లిపాయ ఉపయోగించండి: చలికాలంలో జుట్టును సరిగ్గా చూసుకోవాలి. లేకుంటే జుట్టు వేగంగా రాలిపోతుంది. నిమ్మ, ఉల్లిపాయ రసం జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ రసంతో గుడ్డు ఉపయోగించండి: జుట్టు కోసం గుడ్డు ఉపయోగించడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని ప్రొటీన్, విటమిన్-బి, బయోటిన్ తదితర పోషకాలు జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుతాయి. మీరు ఉల్లిపాయ రసంతో ఉపయోగించవచ్చు. దీని రసం స్కాల్ప్, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.