IRCTC Journey: మీకు ఈ ట్రైన్‌ టిక్కెట్‌ గురించి తెలుసా?మీ జర్నీలో 15 శాతం తగ్గింపునిచ్చే సర్క్యులర్‌ టికెట్‌ వివరాలివే..!

రతీయ రైల్వేలు ప్రజలకు ఉపయోగపడేలా, అలాగే ప్రయాణాలను సులభతరం చేయడానికి కొన్ని సేవలను అందిస్తుంది. ఈ సేవల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఓ టికెట్‌ గురించి ఓ సారి చూద్దాం. సర్క్యులర్ జర్నీ టికెట్‌ అనేది చాలా మందికి తెలియని ఓ మంచి పథకం. ఒకే స్టేషన్‌లో ప్రారంభమై.. మళ్లీ అదే స్టేషన్‌లో ప్రయాణాన్ని పూర్తి చేసే అన్ని ప్రయాణాలకు ఈ టికెట్‌ అందుబాటులో ఉంటుంది.

IRCTC Journey: మీకు ఈ ట్రైన్‌ టిక్కెట్‌ గురించి తెలుసా?మీ జర్నీలో 15 శాతం తగ్గింపునిచ్చే సర్క్యులర్‌ టికెట్‌ వివరాలివే..!
Irctc
Follow us

|

Updated on: Aug 10, 2023 | 8:00 PM

భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రోజువారీ అవసరాలతో పాటు తీర్థయాత్రలు ఇలా ఎలాంటి ప్రయాణాలైనా చౌకగా చేయడానికి అందరూ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. భారతీయ రైల్వేలు ప్రజలకు ఉపయోగపడేలా, అలాగే ప్రయాణాలను సులభతరం చేయడానికి కొన్ని సేవలను అందిస్తుంది. ఈ సేవల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఓ టికెట్‌ గురించి ఓ సారి చూద్దాం. సర్క్యులర్ జర్నీ టికెట్‌ అనేది చాలా మందికి తెలియని ఓ మంచి పథకం. ఒకే స్టేషన్‌లో ప్రారంభమై.. మళ్లీ అదే స్టేషన్‌లో ప్రయాణాన్ని పూర్తి చేసే అన్ని ప్రయాణాలకు ఈ టికెట్‌ అందుబాటులో ఉంటుంది. ఈ సర్క్యూలర్‌ ప్రయాణ టిక్కెట్‌లు ‘టెలిస్కోపిక్ రేట్లు’ ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇవి సాధారణ పాయింట్ నుండి పాయింట్ ఛార్జీల కంటే చాలా తక్కువగా ఉంటాయి. అలాగే అన్ని తరగతుల ప్రయాణాలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రయాణ వివరాలతో పాటు నియమ నిబంధనలను తెలుసుకుందాం.

మీరు ఒక వేళ న్యూఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు సర్క్యూలర్‌ ప్రయాణ టిక్కెట్‌ను తీసుకుంటే మీ ప్రయాణం న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై న్యూఢిల్లీలో ముగుస్తుంది. మీరు ముంబై సెంట్రల్ – మర్మగోవా – బెంగుళూరు సిటీ – మైసూర్ – బెంగుళూరు సిటీ – ఉదగమండలం – తిరువనంతపురం సెంట్రల్ మీదుగా మథుర మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు. మళ్లీ ఇదే ఈ మార్గం ద్వారా తిరిగి న్యూఢిల్లీకి వస్తారు. 7,550 కిలోమీటర్ల ఈ ప్రయాణం కోసం తయారు చేసిన సర్క్యులర్ టికెట్ 56 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ముఖ్యంగా విహార యాత్రలకు వెళ్లే వారికి ఉపయోగపడుతుంది.

సర్కూలర్‌ టికెట్ల వల్ల ఉపయోగాలు

  • ఈ సౌకర్యం వ్యక్తిగతంగా లేదా సమూహాలలో ప్రయాణించే ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్లే వారికి అనువగా ఉంటుంది.
  • రైల్వే సర్క్యులర్ జర్నీ సౌకర్యం రెండు సింగిల్ జర్నీలను కవర్ చేస్తుంది. ప్రతి ప్రయాణం దూరంలోని సగంగా పరిగణిస్తారు. 
  • సాధారణ రూట్‌లు మినహా అన్ని రూట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
  • ఈ టికెట్ 8 స్టేషన్లు/స్టాపేజ్ పాయింట్ల వరకు వర్తిస్తుంది.
  • ప్రారంభ, ముగింపు స్టేషన్లు ఒకే విధంగా ఉండాలి.
  • సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌లో పొందుపర్చిన ప్రతి టిక్కెట్ ధర టెలిస్కోపిక్‌గా ఉంటుంది. అంటే మీ ప్రయాణంలో చేర్చిన మరిన్ని స్టేషన్‌ల కోసం ప్రతి కలుపుకొని టిక్కెట్ ధర తక్కువగా ఉంటుంది. అందువల్ల విడిగా బుక్ చేసుకున్న వ్యక్తిగత టిక్కెట్ల మొత్తం ధర కంటే సర్క్యులర్ జర్నీ టిక్కెట్ చౌకగా ఉంటుంది.
  • ఇది చాలా సమయం ఆదా చేస్తుంది.

సర్క్యులర్ జర్నీ టికెట్ బుకింగ్ విధానం

  • మీ ప్రయాణ ప్రణాళిక ఖరారైన తర్వాత మీరు ప్రయాణం ప్రారంభించే స్టేషన్‌కు చెందిన కొన్ని ప్రధాన స్టేషన్‌ల డివిజన్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌ని సంప్రదించవచ్చు.
  • డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా స్టేషన్ అధికారులు మీ ప్రయాణ ప్రణాళిక ఆధారంగా టిక్కెట్‌ల ధరను గణిస్తారు. అతను నిర్ణీత ఫార్మాట్‌లో స్టేషన్ మేనేజర్‌కి కూడా తెలియజేస్తాడు.
  • మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్న స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో ఈ ఫారమ్‌ను ప్రదర్శించడం ద్వారా మీరు సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.
  • సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన తర్వాత మీ ప్రయాణంలో వివిధ ల్యాప్‌ల కోసం మీ వసతిని రిజర్వ్ చేయడానికి మీరు తప్పనిసరిగా రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలి.
  • అప్పుడు మీరు ప్రయాణం కోసం రిజర్వ్ చేసిన ప్రయాణ టిక్కెట్‌ను జారీ చేస్తారు.
  • ఒక సర్క్యూలర్‌ టికెట్‌ రెండు సింగిల్ జర్నీలకు ఛార్జీ విధిస్తారు. ప్రతి ప్రయాణం మొత్తం దూరంలో సగంగా తీసుకుంటారు.
  • కనిష్టంగా 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటప్పుడు సర్క్యులర్ జర్నీ టిక్కెట్ల ధరపై పురుష సీనియర్ సిటిజన్‌లకు 40 శాతం, మహిళా సీనియర్ సిటిజన్‌లకు 50 శాతం రాయితీ ఇస్తారు. 
  • సర్క్యులర్ జర్నీ టిక్కెట్లను బుక్ చేసుకునే నియమాలు
  • అదే స్టేషన్‌లో ప్రారంభించి పూర్తి చేసే సర్క్యులర్ జర్నీ కోసం సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌ల విషయంలో బ్రేక్ జర్నీపై సాధారణ నియమాలు వర్తించవు. ఈ ప్రయోజనం కోసం అతి తక్కువ మార్గంలో లేదా చిన్న మార్గం కంటే 15 శాతం ఎక్కువ దూరం ఉన్న మార్గంలో తిరిగి వెళ్లే ప్రయాణం సర్క్యూలర్‌ ప్రయాణంగా పరిగణించరు.
  • అన్ని తరగతులకు సర్క్యులర్ జర్నీ టిక్కెట్లను జారీ చేయవచ్చు. సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌ను జారీ చేసే ముందు ప్రయాణీకుడు జర్నీని బ్రేక్ చేయాలనుకుంటున్న గరిష్టంగా ఎనిమిది స్టేషన్‌ల పేర్లను సలహా ఇవ్వమని అడగాలి.

చెల్లుబాటు వ్యవధి

టిక్కెట్ చెల్లుబాటు వ్యవధి ప్రయాణ రోజులు, విరామ ప్రయాణ రోజుల మొత్తంతో లెక్కిస్తారు. ప్రయాణ రోజులు 400 కిలో మీటర్ల దూరానికి 1 రోజు లేదా దాని భాగానికి గణిస్తారు. అలాగే విరామ ప్రయాణ రోజులను 200కిలోమీటర్లకు 1 రోజుకు లెక్కించాలి. టిక్కెట్‌పై సూచించిన ప్రయాణం రోజు నుంచి టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది. విరామ ప్రయాణాన్ని ప్రారంభించడంలో ఎలాంటి పరిమితి ఉండదు. ప్రయాణీకుడు ప్రయాణం ప్రారంభించేటప్పుడు టిక్కెట్‌పై తేదీతో తన సంతకాన్ని ఉంచాలి.

ఇవి కూడా చదవండి

బ్రేక్ జర్నీ 

సర్క్యులర్‌ ప్రయాణ టిక్కెట్‌పై గరిష్ట సంఖ్యలో బ్రేక్ జర్నీలు 8 (ఎనిమిది) ఉంటాయి. సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌లపై బ్రేక్-జర్నీ ఆమోదం అవసరం లేదు.

సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌కు ఛార్జీ 

రెండు సింగిల్ జర్నీలకు సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌కి ఛార్జీ విధిస్తారు. ఒక్కో ప్రయాణానికి మొత్తం దూరంలో సగం తీసుకుంటారు. వివిధ ప్రయాణాల కోసం రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్-ఫాస్ట్‌లో అనుబంధ ఛార్జీలు మొదలైనవి అదనంగా విధిస్తారు. ఒక ప్రయాణీకుడు ఉన్నత తరగతిలో లేదా ఉన్నత వర్గానికి చెందిన రైళ్లలో ప్రయాణిస్తే అతను పాయింట్ టు పాయింట్ ప్రాతిపదికన అంత దూరానికి ఛార్జీల వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..