Unique jewellery: ఈ యువతి వెరీ వెరీ స్పెషల్ గురూ… తల్లి పాలతో, తండ్రి రక్తంతో నగల తయారీ.. లక్షల్లో సంపాదన

ప్రీతి మాగ్గో  బొడ్డు తాడు నుండి నగలను తయారు చేస్తుంది. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలను ఆస్వాదించవచ్చు. ఆమె రక్తంతో నగలు కూడా చేస్తుంది.. తద్వారా పిల్లలు తమ తల్లిదండ్రుల జ్ఞాపకాలను తమతో ఉంచుకోవచ్చు.

Unique jewellery: ఈ యువతి వెరీ వెరీ స్పెషల్ గురూ... తల్లి పాలతో, తండ్రి రక్తంతో నగల తయారీ.. లక్షల్లో సంపాదన
Preeti Maggo
Follow us
Surya Kala

|

Updated on: Feb 01, 2023 | 10:57 AM

తల్లి పాలతో, తండ్రి రక్తంతో తయారు చేసిన ఆభరణాలు, ఉంగరాలు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఈ నగల ద్వారా తల్లిదండ్రులు.. పిల్లల మధ్య బంధనాన్ని..  ప్రతి క్షణం గుర్తుంచుకోగలరు. బొడ్డు తాడుతో తయారు చేసిన లాకెట్ ధరించడం ద్వారా నవజాత శిశువు  మొదటి స్పర్శను మీరు ప్రతి క్షణం అనుభవించవచ్చు. ప్రియమైనవారి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి ఇవన్నీ ఇప్పుడు భారతదేశంలో తయారవుతున్నాయి. వీటిని తయారు చేస్తోంది.. ప్రీతి మాగ్గో అనే యువతి. దేశ రాజధాని వేదిక ఢిల్లీ వేదికగా ప్రీతి తన స్వంత స్టార్టప్‌ను మ్యాజిక్ ఆఫ్ మెమోరీస్ పేరుతో స్థాపించింది. పాలతో, తండ్రి రక్తంతో నగలు తయారు చేస్తోంది. ఈ ఆభరణాలకు కస్టమర్‌లు రోజురోజుకు పెరుగుతున్నారు.

ఇటీవల, షార్క్ ట్యాంక్ ఇండియాలో తన స్టార్టప్ గురించి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్రీతి మాగో వెలుగులోకి వచ్చింది. ప్రీతికి సోషల్ మీడియాలో మంచి సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు . ప్రీతి విభిన్న ఆలోచనలతో నగలను తయారు చేస్తూ.. కెరీర్ లో నిరంతరం ముందుకు సాగుతోంది. ట్రావెల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రీతి సాధించిన ఈ విజయం గురించి ఈ రోజు  తెలుసుకుందాం.

మ్యాజిక్ ఆఫ్ మెమోరీస్ 2019లో ప్రారంభం ప్రీతి మాగో తన వ్యాపార స్టార్టప్ మ్యాజిక్ ఆఫ్ మెమోరీస్‌ను 2019లో ప్రారంభించింది. ఆమె తల్లి పాలు, వెంట్రుకలు, బొడ్డు తాడు, రక్తంతో నగలను తయారు చేస్తుంది. ఇటీవల.. ప్రీతి షార్క్ ట్యాంక్ ఇండియాలో పాల్గొని తన స్టార్టప్ కోసం 25 లక్షల రూపాయల పెట్టుబడిని కోరింది. షార్క్ ట్యాంక్ ఇండియా ప్రతి ఆలోచనకు మద్దతు ఇవ్వలేదు.. అయితే ఆన్‌లైన్‌లో చాలా మద్దతు లభించింది. ప్రీతికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

 జ్ఞాపకాలను పదిలం చేసే ప్రయోగం ప్రీతి మాగ్గో  బొడ్డు తాడు నుండి నగలను తయారు చేస్తుంది. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలను ఆస్వాదించవచ్చు. ఆమె రక్తంతో నగలు కూడా చేస్తుంది.. తద్వారా పిల్లలు తమ తల్లిదండ్రుల జ్ఞాపకాలను తమతో ఉంచుకోవచ్చు . అంతేకాదు మహిళల కోసం,  తల్లి పాలతో లాకెట్లు , ఇతర వస్తువులను తయారుచేస్తుంది. ఈ నగలతో స్త్రీలు తమ మాతృత్వాన్ని జీవితాంతం ఆనందిస్తారు. ఇంట్లోని పెంపుడు జంతువులకు కూడా ప్రీతి వివిధ డిజైన్ల ఆభరణాలను డిజైన్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆమె 600 మందికి పైగా ఆభరణాలను డిజైన్ చేసింది.

ఎలా మొదలు పెట్టిందంటే..  ఫేస్‌బుక్ లో ఒక జర్మన్ ఆర్టిస్ట్ ఇలాంటి నగలను తయారు చేయడాన్ని చూసింది. అప్పుడు తనకు కూడా తల్లి పాలతో నగలు తయారు చేయాలనే ఆలోచన తనకు వచ్చిందని ప్రీతి మాగో చెప్పింది. 2019లో, ప్రీతి బిడ్డకు 6 నెలల వయస్సు ఉన్నప్పుడు.. తన తల్లి పాల నుండి నగల నమూనాను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చాలామంది ఇష్టపడ్డారు. కొందరు తల్లులు  తమకి కూడా ఆభరణాలు కావాలంటూ.. నగలు తయారు చేయడానికి తమ తల్లి పాల నమూనాలను పంపడం ప్రారంభించారు. క్రమంగా ఇలాంటి నగల తయారు చేయమంటూ అనేక మంది కోరడంతో..  ఆర్డర్లు మొదలయ్యాయి.

2 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ధర.. తల్లిపాలు, రక్తం లేదా బొడ్డు తాడుతో తయారు చేసే ఆభరణాల ధర రూ. 2 వేల నుంచి లక్షల వరకు ఉంటుందని ప్రీతి మాగో తెలిపింది. ప్రజలు ఎంచుకున్న మెటల్, డిజైన్ ఆధారంగా ధరలు ఉంటాయి. యువర్ స్టోరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రీతి మాట్లాడుతూ.. షార్క్ ట్యాంక్ తన కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోలేకపోయిందని చెప్పింది. రోజు రోజుకీ నగల కోసం ఆర్డర్ ఇచ్చే కస్టమర్స్ ఎక్కువ అవుతున్నారని.. దీంతో తన బృందాన్ని పెంచడానికి నిధులు అవసరమయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం ప్రీతీ ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఉంగరాలు, పెండెంట్‌లు, బ్రాస్‌లెట్‌లు సహా ఏ డిజైన్ ఆభరణాలనైనా తయారు చేయగలదు.

ప్రీతి ఢిల్లీలో నివసిస్తుంది.. ప్రతి నెలా 5 లక్షలు సంపాదన జలంధర్‌కు చెందిన ప్రీతి మాగో తన స్టార్టప్ నుండి ప్రతి నెలా ఐదు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పింది.  ఆమె  ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తుంది. జామియా హమ్దార్ద్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకుంది.

ఆభరణాలు ఎలా తయారు చేస్తుందంటే..  తల్లి పాలు లేదా రక్తంతో నగలు తయారు చేయాలంటే.. అవి చెడిపోకుండా ముందుగా ప్రిజర్వేటివ్స్‌ని జోడించి రక్షించాలని ప్రీతి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తరువాత అవి గట్టిపడతాయి.. తద్వారా మౌల్డింగ్ సులభం. అనంతరం కస్టమర్ కు కావాల్సిన డిజైన్,  మెటల్‌తో నగలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది, అందువల్ల ఆర్డర్‌ను తీసుకున్న తర్వాత ఆభరణాల డెలివరీకి సమయం పడుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..