Diabetic Patient Breakfast: మధుమేహం బాధితులు ఇడ్లీకి బదులుగా వీటినే తింటే ప్రయోజనం.. వైద్యుల సూచనలివే..

Diabetic Patient Breakfast: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందంటారు. అవును, మన జీవనశైలి బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Diabetic Patient Breakfast: మధుమేహం బాధితులు ఇడ్లీకి బదులుగా వీటినే తింటే ప్రయోజనం.. వైద్యుల సూచనలివే..
Diabetic Patient Breakfast
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2022 | 1:28 PM

Diabetic Patient Breakfast: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందంటారు. అవును, మన జీవనశైలి బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ నోటికి రుచిగా ఉండే ఆహారం.. శరీరానికి అవసరం లేదు. శరీరానికి వసరమైన ఆహారం మన నోటికి రుచించదు. ఇదే అసలు సమస్యకు కారణం అవుతుంది. జీవనశైలి సరిగా లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటితో సహా అనేక కారణాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి. మంచి జీవనశైలిని పాటించాలి. రోజూ వ్యాయామం చేయాలి. ముఖ్యంగా మధుమేహ బాధితులు తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి. చాలా మంది ఉదయం సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ ఎక్కువగా తింటారు. అయితే, దానికంటే ఉత్తమమైన, ఆరోగ్యకరమైనది పోహా మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. పోహా తినడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు. ఉదయాన్నే చాలా ఈజీగా, త్వరగా ప్రిపేర్ చేసుకునే ఆరోగ్యకరమైన వంటకం పోహా. ఈ పోహా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోహాలో ఉండే పోషకాలు..

1. పోహాలో 70 శాతం ఆరోగ్యకరమైన కార్పోహైడ్రేట్స్, 30 శాతం కొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 2. ఇందులోని పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం కంట్రోల్‌లో ఉండాలంటే అన్నం, ఇడ్లీ, దోసెల కంటే పోహా మేలు. 3. ప్రముఖ వైద్యులు బేబ్జానీ బెనర్జీ ప్రకారం.. పోహాలో ప్రోబయోటిక్స్, B విటమిన్లు, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇది వైట్ రైస్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. బియ్యంలో సాధారణంగా ఫైబర్ తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రోటీన్‌తో కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఈ పదార్థాలతో పోహా తయారు చేస్తే..

పోహాలో బఠానీలు, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, కరకరలాడే వేరు శెనగ వంటి అనేక కూరగాయలతో తయారు చేయొచ్చు. వీటిని అందులో వేయడం వలన పోహా మరింత పోషకాలతో కూడిన వంటకం అవుతుంది. పోహా తినడం వలన పొట్ట లైట్‌గా ఉంటుంది. తేలికగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో దీనిని తినొచ్చు.

ఒక ప్లేట్ పోహాలో 250 కేలరీల శక్తి..

కూరగాయలు మిక్స్ చేసి తయారు చేసిన ఒక ప్లేట్ పోహాలో 250 కేలరీల శక్తి ఉంటుంది. అనేక విటమిన్లు, ఖజినాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. ఇందులో వేరు శెనగలు, క్యారెట్స్, బీన్స్ కూడా వేయడం వలన యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ శరీరానికి అందుతుంది.

పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది..

పోహాలో ఉండే ప్రోబయోటిక్స్.. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దేశీ, ఎరుపు పోహాలో జింక్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

జిర్ణక్రియను పెంచుతుంది..

పోహా తినడం వలన జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. తేలికపాటి అల్పాహారం కావడంతో, ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం, ఆయాసం వంటి సమస్యలు రావు. తేలికగా అరుగుతుంది.

కొవ్వును తగ్గిస్తుంది..

శరీరంలో అదనపు కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు, ఎసిడిటీ వంటి సమస్య రాకుండా ఉండాలంటే.. పోహా సరైన ఆహారం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారంగా పోహా తినడం వలన మేలు జరుగుతుందని చెబుతున్నారు.

(గమనిక: పై కథనాన్ని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఆరోగ్యపరంగా ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించిన తరువాత దీనిని తీసుకోవాలి)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..