Heart Side Effects: ఉప్పు, చక్కెర, అధిక కొవ్వులు ఉన్న పదార్థాలు తింటే గుండె ఆరోగ్యానికి హాని జరుగుతుందా ?

|

Aug 21, 2023 | 10:16 PM

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యేవారు, గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుకు రకరకాల కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అధికంగా కొవ్వు ఉండే ఆహారం తినడం గుండెజబ్బులకు ప్రధాన కారణం. అలాగే షుగర్, ఉప్పు ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదైనా శరీరానికి కావలసినదానికంటే ఎక్కువ తీసుకుంటే.. అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతుల్యమైన ఆహారం, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు సమపాళ్లలో..

Heart Side Effects: ఉప్పు, చక్కెర, అధిక కొవ్వులు ఉన్న పదార్థాలు తింటే గుండె ఆరోగ్యానికి హాని జరుగుతుందా ?
Heart
Follow us on

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యేవారు, గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుకు రకరకాల కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అధికంగా కొవ్వు ఉండే ఆహారం తినడం గుండెజబ్బులకు ప్రధాన కారణం. అలాగే షుగర్, ఉప్పు ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదైనా శరీరానికి కావలసినదానికంటే ఎక్కువ తీసుకుంటే.. అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతుల్యమైన ఆహారం, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు సమపాళ్లలో అందించాలి. అలా చేస్తేనే ఎక్కువకాలం జీవించగలుగుతాం.

ఉప్పుతో గుండెకు హాని:

మనం వంటచేసేటపుడు కూరలో అన్నీ వేస్తాం. కానీ.. కాస్త ఉప్పు తగ్గితే దానికి సరైన రుచి ఉండదు. అందుకే.. అన్నీవేసి చూడు.. నన్నువేసి చూడు అంటుందట ఉప్పు అనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. ఉప్పును అధికంగా వాడటం అన్నివిధాలా చేటే. ఇది శరీరానికి కావలసిన పోషకమే అయినప్పటికీ.. మనం బయట తినే ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తపోటు (బీపీ) వస్తుంది. ఉప్పులో ఉండే సోడియం కారణంగా గుండెపై భారం పడి రక్తనాళాలు ఒత్తిడికి గురవుతాయి. అందుకే గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

గుండెపై షుగర్ ఎఫెక్ట్:

షుగర్ అంటే వ్యాధి గురించి కాదు. పంచదార గురించి. రోజూ ఏదోవిధంగా మనం పంచదారను తీసుకుంటూ ఉంటాం. మోతాదుకు మించిన చక్కెర వినియోగం బరువును పెంచుతుంది. ఇన్సులిన్ ను నిరోధించి.. రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచేస్తుంది. ధమనులను ఒత్తిడికి గురిచేస్తాయి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్.. ఇలా తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే త్వరగా షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ ప్రమాదం ఎక్కువవుతుంది.

అధిక కొవ్వులతో ప్రమాదం:

మూడుపూటలా తిని.. ఎలాంటి కదలిక లేకుండా ఉంటే.. ఈజీగా బరువు పెరిగిపోతాం. ఇక ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు తింటే.. వాటిలో ఉండే అనారోగ్యకరమైన అధికకొవ్వులు.. ఉన్న ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ధమనులలో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. ఫలితంగా గుండెకు రక్తసరఫరాలోఆటంకం కలిగి.. గుండెపోటు వస్తుంది. మంట కలుగుతుంది.

గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే.. సీ ఫుడ్, చిక్కుళ్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, బఠాణీలు, బాదం, పిస్తా ఎక్కువగా తినాలి. ఎక్కువగా నూనెతో వండే పదార్థాలు, జంక్ ఫుడ్ తినకూడదు. అలాగే తృణధాన్యాలు, నిల్వచేయని మాంసాహారం తినాలి. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి