Difference Between Eggs: నాటు కోడిగుడ్డు..ఫారం కోడిగుడ్డు రెండింటిలో ఏది మంచిదో తెలుసా? నిపుణుల అభిప్రాయం ఏంటి?

దశాబ్దాలుగా ఫారం గుడ్డు కంటే నాటుకోడి గుడ్డు మంచిదని మన మెదళ్లలో నాటుకుపోయింది. నాటుకోడి గుడ్డులో ఎక్కువ పోషకాహారం లభిస్తుందని మనం సాధారణంగా అనుకుంటాం.

Difference Between Eggs: నాటు కోడిగుడ్డు..ఫారం కోడిగుడ్డు రెండింటిలో ఏది మంచిదో తెలుసా? నిపుణుల అభిప్రాయం ఏంటి?
Eggs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 15, 2022 | 11:20 AM

గుడ్డు..వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తీసుకునే ఆహారం. ముఖ్యంగా జిమ్ చేసే వారు..గర్భిణులు, పిల్లలు కచ్చితంగా తమ డైట్ లో గుడ్డును చేర్చుకుంటారు. గుడ్డులో ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉండడమే కాకుండా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అయితే చాలా మంది ఫారం కోడిగుడ్లతో పోల్చుకుంటే నాటుకోడిగుడ్లు తీసుకోవడానికి ఇష్టపడతారు. దశాబ్దాలుగా ఫారం గుడ్డు కంటే నాటుకోడి గుడ్డు మంచిదని మన మెదళ్లలో నాటుకుపోయింది. నాటుకోడి గుడ్డులో ఎక్కువ పోషకాహారం లభిస్తుందని మనం సాధారణంగా అనుకుంటాం. ఎన్ని డబ్బులు అయినా నాటుకోడి గుడ్లను కచ్చితంగా కొంటుంటాం. సాధారణ కోడిగుడ్డుతో పోల్చుకుంటే నాటుకోడి ఐదారు రెట్లు రేటు ఎక్కువ ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం రెండు కోడిగుడ్లలో సమానమైన పోషకాహారం ఉంటుందని చెబుతున్నారు. గుడ్డు పెంకు రంగు అవి తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కోడి ఉత్పత్తి చేసే పెగ్మెంట్ల బట్టి కూడా పెంకు రంగు డిసైడ్ అవుతుందని అంటున్నారు. 

ఎందులో పోషకాహారం ఎక్కువ?

సాధారణంగా కోడి గుడ్లలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే..అయితే రెండు రకాల కోడి గుడ్లల్లో కోలిన్, ఫోలియేట్, ఐరన్, జింక్, విటమిన్ బీ 12, విటమిన్ ఏ, సెలీనియం వంటి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అయితే గుడ్లలోని పోషక విలువలు కోడి తీసుకునే ఆహారం, అది తిరిగే పరిసరాల బట్టి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఫారం కోడితో పోల్చుకుంటే నాటుకోడి గుడ్లను తక్కువ పెడుతుంది. అందువల్ల నాటుకోడి గుడ్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది తప్ప రెండు గుడ్లలో పోషక విలువలు సమానంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఏ రకమైన గుడ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. గుడ్లు తాజాగా ఉండాలని వివరిస్తున్నారు. ఫ్రిజ్ లో నిలువ ఉంచిన గుడ్లను మాత్రమే వాడాలని, బయట ఉంచిన గుడ్లను వాడకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి.