Health Tips: పరగడుపునే వీటిని ఆహారంగా తీసుకుంటే.. జీవితంలో ఏ రోగం కూడా మీ దరిచేరదు..

చాలామంది ఉదయం లేచినవెంటనే ముందూ వెనుకా ఆలోచించకుండా  ఏది పడిదే అది అన్నట్లు వివిధ రకాల పదార్ధాలు తింటుంటారు. వీటి ప్రభావంగా నేరుగా ఆరోగ్యంపై..

Health Tips: పరగడుపునే వీటిని ఆహారంగా తీసుకుంటే.. జీవితంలో ఏ రోగం కూడా మీ దరిచేరదు..
Soaked Foods For Healthcare
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 09, 2023 | 9:13 AM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు చాలా అవసరం. నిత్యం పోషకాలతో కూడిన హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమై..దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలామంది ఉదయం లేచినవెంటనే ముందూ వెనుకా ఆలోచించకుండా  ఏది పడిదే అది అన్నట్లు వివిధ రకాల పదార్ధాలు తింటుంటారు. వీటి ప్రభావంగా నేరుగా ఆరోగ్యంపై చూపిస్తుంది. ఇంకొంతమంది అయితే ఉదయం లేచిన తరువాత చాలా సేపటి వరకూ ఏం తినకుండా ఉంటారు. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ క్రమంలో రోజూ లేచిన వెంటనే ఏం తినాలి, ఏం తినకూడదనే వివరాలు పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అందుకే ఉదయం లేచిన వెంటనే తినదగిన ఆహార పదార్ధాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. మరి అవేమిటంటే..

  1. కిస్మిస్: కిస్మిస్ లేదా ఎండు ద్రాక్షలు మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇందులో పెద్దమొత్తంలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరం బలహీనత దూరమవుతుంది. దాంతోపాటు రక్తంలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. అంతేకాక పరగడుపున కిస్మిస్ తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి వేళ 6 కిస్మిస్ గింజల్ని నీళ్లలో నానబెట్టి..ఉదయం పరగడుపున నీళ్లతో సహా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
  2. బాదం: బాదం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో పెద్దమొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. వీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే..మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. బరువు తగ్గించేందుకు సైతం బాదం దోహదపడుతుంది. ఇంకా నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  3. ఎండు ఖర్జూరం: ఎండు ఖర్జూరంలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి, దాని ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. రాత్రి వేళ నీళ్లలో ఎండు ఖర్జూరాలను నానబెట్టి ఉదయం లేచిన వెంటనే తినడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. అదే సమయంలో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు బరువు తగ్గించేందుకు సైతం ఇది ఉపయోగపడుతుంది.
  4.  జీడిపప్పు: మానవ శరీరానికి అవసరమైన పోషకాలు, ఉపయోగాలు జీడిపప్పులో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను బయటికి పంపి మంచి కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది. జీడిపప్పులో కాపర్‌, ఫాస్పరస్‌, జింక్‌, ఐరన్‌, మాంగనీస్‌, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్‌, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోజూ మితంగా జీడిపప్పు తింటే పోషక లోపంతో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు  జీడిపప్పు అధిక రక్తపోటును తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. ఇంకా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎముకలను పటిష్టం చేస్తుంది. జీడిపప్పులో ఉండే లుటిస్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఫైబర్‌ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. కాపర్‌ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం