Brahmamudi, August 18th episode: మళ్లీ కావ్యని ఇరికించేసిన రుద్రాణి.. కావ్యని కొట్టబోయిన రాజ్!!

|

Aug 18, 2023 | 12:09 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ ని కావాలని ఏడిపిస్తూ ఉంటుంది కావ్య. రాజ్ ఉప్మా తినమని అన్నా.. కావ్య కావాటని ఆట పట్టిస్తూ.. రాజ్ వెంట పరిగెడుతూ ఉంటుంది. దీంతో రాజ్ పనిగెడుతూ.. బయట ఉన్న మట్టిలో కాలు వేస్తాడు. అయ్యో ఏంటి బాబూ పొరపాటున కాలు వేశావా.. రా వచ్చి కడుక్కో బాబూ అంటూ కనకం, కృష్ణమూర్తిలు అంటారు. దీనికి కావ్య లేదు అమ్మా.. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. మా ఆయన చేత్తోనే ప్రారంభిస్తారు. అలాగే ఇప్పుడు ఈయన కాళ్ల మీదుగా కూడా చేస్తానని మట్టి మధ్యలోకి దిగారు అని రాజ్ ని ఇరికిస్తుంది కావ్య. దీంతో రాజ్ తెల్ల ముఖం వేసుకుని..

Brahmamudi, August 18th episode: మళ్లీ కావ్యని ఇరికించేసిన రుద్రాణి.. కావ్యని కొట్టబోయిన రాజ్!!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ ని కావాలని ఏడిపిస్తూ ఉంటుంది కావ్య. రాజ్ ఉప్మా తినమని అన్నా.. కావ్య కావాటని ఆట పట్టిస్తూ.. రాజ్ వెంట పరిగెడుతూ ఉంటుంది. దీంతో రాజ్ పనిగెడుతూ.. బయట ఉన్న మట్టిలో కాలు వేస్తాడు. అయ్యో ఏంటి బాబూ పొరపాటున కాలు వేశావా.. రా వచ్చి కడుక్కో బాబూ అంటూ కనకం, కృష్ణమూర్తిలు అంటారు. దీనికి కావ్య లేదు అమ్మా.. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. మా ఆయన చేత్తోనే ప్రారంభిస్తారు. అలాగే ఇప్పుడు ఈయన కాళ్ల మీదుగా కూడా చేస్తానని మట్టి మధ్యలోకి దిగారు అని రాజ్ ని ఇరికిస్తుంది కావ్య. దీంతో రాజ్ తెల్ల ముఖం వేసుకుని చూస్తూ ఉంటాడు. తొక్కండి మట్టి అని కావ్య అంటే.. తొక్కాల అని రాజ్ అంటాడు. పోనీ తాతయ్య పర్మిషన్ తీసుకోవాలా.. అమ్మా లోపల నా ఫోన్ ఉంది ఇవ్వు అని అడుగుతుంది. దీనికి రాజ్ అవసరం లేదమ్మా.. మట్టే కదా తొక్కుతా అంటాడు. ఆ తర్వాత కావ్య కూడా వెళ్లి ఇద్దరూ కలిసి మట్టిని తొక్కుతారు. ఇది చూసి కనకం, కృష్ణమూర్తి సంతోషడుతూ ఉంటారు. మరోవైపు రాహుల్ మాట్లాడిన ఓ వ్యక్తి.. కావ్య, రాజ్ లు మట్టి తొక్కడాన్ని వీడియో తీస్తూ ఉంటాడు. ఇది రుద్రాణి, రాహుల్ లకు పంపిస్తాడు.

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక కోసం మళ్లీ ఓ కవిత రాయడానికి సిద్ధమవుతాడు కళ్యాణ్. ఎలాగైనా కవిత రాసి అనామికను బయటకు రప్పించాలని ప్రయత్నిస్తూంటాడు. ఈలోపు అక్కడ ఓ వ్యక్తి కళ్యాణ్ రాసి పడేసిన కాగితాలను ఏరుకుంటూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్ పిలిచి ఏంటి.. నా చుట్టూనే తిరుగుతున్నావు అని అడగ్గా.. ఏమీ లేదయ్యా.. మీరు పడేసిన కాగితాలను అమ్ముకుంటే ఓ కేజీ బియ్యం అయినా వస్తాయి.. నేనేమీ మీకు చిరాకు తెప్పించనయ్యా.. దూరంగానే ఉంటూ కాగితాలను ఏరుకుంటా అంటాడు. ఈలోపు అనామిక దగ్గరకు చెత్త ఏరుకునే వ్యక్తి వెళ్లి.. అమ్మగారూ మీరు చెప్పినట్టే ఆయన పడేసిన చెత్త కాగితాలను తీసుకొచ్చాను అని చెప్తాడు.

నెక్ట్స్ రాజ్, కావ్యల వీడియో తీసిన వ్యక్తి.. రాహుల్ కి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు. అది చూసిన రాహుల్, రుద్రాణికి వీడియో పంపిస్తాడు. ఈ వీడియోను వెంటనే సోషల్ మీడియలో వైరల్ అయ్యేలా చూడు.. దీన్ని నేను అపర్ణ వదినకు చూపించి ఇంట్లో భూకంపం సృష్టిస్తాను అని అంటుంది. ఆ తర్వాత రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి.. ఆడుకుంటుంది. స్కూల్లో, కాలేజీలో ఎంత మంది ప్రపోజ్ చేసినా పక్కకు పెట్టేశావు.. ఇప్పుడు పెళ్లి అయిపోయాక కూడా ఇలా ఉంటే చాలా కష్టం అంటూ ఇరిటేట్ చేస్తాడు. నువ్వూ, కళావతి ఇద్దరూ ఒక్కటి అవ్వాలని చెప్తాడు. అది ఎప్పటికీ జరగదు అని అంటాడు రాజ్.

ఇవి కూడా చదవండి

ఈ సీన్ తర్వాత ఇప్పటికే ఆలస్యమైంది.. ఇక ఇంటికి వెళ్లు అమ్మా అని కృష్ణమూర్తి కావ్యకి చెప్తాడు.. లేదు నాన్న ఇంకా పని కాలేదు అని అంటుంది. దీంతో కనకం, కృష్ణమూర్తి కావ్యని మందలిస్తారు. నువ్వు ఈ ఇంటి కూతురివి కాదు.. ఆ ఇంటి కోడలివి.. అవకాశం ఇచ్చారు కదా అని అలుసుగా తీసుకోకూడదు.. వెళ్లు అంటూ చెప్తారు. అదేం కూదరదు.. నీకోసం ఆటో తీసుకొచ్చా వెళ్లు అంటూ అప్పు అంటుంది. ఏంటే నన్ను తరిమేస్తున్నావా.. అని కావ్య అడుగుతుంది. ఇప్పుడు నిన్ను తరమక పోతే.. తర్వాత నీ పెనిమిటి వచ్చి నా పెళ్లాన్ని ఇక్కడ కట్టి పడేస్తున్నారా అని మా మీద పడతాడు అని అంటుంది అప్పు. ఇక దీంతో అక్కడి నుంచి బయలు దేరుతుంది కావ్య.

ఇక కళ్యాణ్ రాసి పడేసిన పేపర్స్ లో ఉన్న వాటిని చదువుతూ మురిసిపోతుంది అనామిక. అలా మొత్తానికి అనామిక ఫేస్ ని ఈ రోజు రివీల్ చేస్తారు. ఇక కావ్య గురించి చెప్పడానికి అపర్ణ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. కావ్య, రాజ్ లు కలిసి మట్టి తొక్కిన ఫొటోను చూపిస్తూ.. ఎక్కడా లేనివన్నీ చెప్తుంది. అది చూసిన అపర్ణ.. రగిలిపోతుంది. ఇప్పుడు నమ్ముతావా వదినా.. పాపం రాజ్.. కావ్యని దింపడానికి వెళ్లి మట్టి తొక్కుతూ దొరికపోయాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వదినా.. కావ్య నీ కొడుకును మాయ చేస్తుంది. వలలో వేస్తుంది. త్వరలో నిన్నూ, నపీ మాటను లెక్క చేయడు అని.. కానీ నువ్వే నమ్మలేదు. నా కొడుకు తల్లి మాట జవదాటడు. నా మాట వాడికి శిలా శాసనం అంటూ చెప్పావ్.. ఇప్పుడేమైంది అంటూ అపర్ణను ఒక రేంజ్ లో రెచ్చగొడుతుంది రుద్రాణి. దీంతో ఈ రోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.