ఒరిస్సా లోక్‌ సభ నియోజకవర్గాలు ఎన్నికల ఫలితాలు - Odisha Lok Sabha Election Constituencies Wise Result

భారత దేశ తూర్పు ప్రాంతంలోని రాష్ట్రం ఒడిశా. ఒడిశాలో సహజ సౌందర్యం, ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రాష్ట్రం చుట్టూ పశ్చిమాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో పశ్చిమ బెంగాల్, ఉత్తరాన బీహార్ మరియు జార్ఖండ్, ఆగ్నేయంలో ఆంధ్ర ప్రదేశ్, తూర్పున బంగాళాఖాతం ఉంది. ఒడిశాకు 480 కి.మీ పొడవైన తీరప్రాంతం ఉంది. ఆ రాష్ట్ర మొత్తం వైశాల్యం 1,55,707 చదరపు కి.మీ. దేశం మొత్తం వైశాల్యంలో ఒడిశా 4.87% గా ఉంది. విస్తీర్ణంలో 8 వ అతిపెద్ద రాష్ట్రంగానూ.. జనాభా ప్రకారం 11 వ అతిపెద్ద రాష్ట్రంగానూ ఒడిశా ఉంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్. ఆ రాష్ట్రంలో 4.19 కోట్ల మంది జనాభా ఉన్నారు.

పూరీ జగన్నాథ్ దేవాలయం హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజూ జనతాదళ్(బీజేడీ) 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.
 

ఒరిస్సా లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Orissa Balasore PRATAP CHANDRA SARANGI 563865 BJP Won
Orissa Puri SAMBIT PAATRA 629330 BJP Won
Orissa Kandhamal SUKANTA KUMAR PANIGRAHI 416415 BJP Won
Orissa Mayurbhanj NABA CHARAN MAJHI 585971 BJP Won
Orissa Aska ANITA SUBHADARSHINI 494226 BJP Won
Orissa Dhenkanal RUDRA NARAYAN PANY 598721 BJP Won
Orissa Jajpur RABINDRA NARAYAN BEHERA 534239 BJP Won
Orissa Nabarangpur BALABHADRA MAJHI 481396 BJP Won
Orissa Bhadrak AVIMANYU SETHI 573319 BJP Won
Orissa Bolangir SANGEETA KUMARI SINGH DEO 617744 BJP Won
Orissa Berhampur DR PRADEEP KUMAR PANIGRAHY 513102 BJP Won
Orissa Cuttack BHARTRUHARI MAHTAB 531601 BJP Won
Orissa Kendrapara BAIJAYANT JAI PANDA 615705 BJP Won
Orissa Bargarh PRADEEP PUROHIT 716359 BJP Won
Orissa Sambalpur DHARMENDRA PRADHAN 592162 BJP Won
Orissa Jagatsinghpur BIBHU PRASAD TARAI 589093 BJP Won
Orissa Kalahandi MALVIKA DEVI 544303 BJP Won
Orissa Koraput SAPTAGIRI ULAKA 471393 INC Won
Orissa Keonjhar ANANTA NAYAK 573923 BJP Won
Orissa Bhubaneswar APARAJITA SARANGI 512519 BJP Won
Orissa Sundargarh JUAL ORAM 494282 BJP Won

ఒడిషా భారతదేశంలోని తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రం. ఒడిశాను ప్రాచీన కాలంలో 'కళింగ' అని పిలిచేవారు. ఈ కళింగ రాజ్యాన్ని జయించిన తర్వాత, గొప్ప చక్రవర్తి అశోకుడు యుద్ధాన్ని త్యజించి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఒడిశా రాష్ట్రం ఈశాన్యంలో పశ్చిమ బెంగాల్, ఉత్తరాన జార్ఖండ్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దులు కలిగి ఉంది. దాని తూర్పున బంగాళాఖాతం ఉంది. ఒడిశా వైశాల్యం పరంగా దేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 11వ అతిపెద్ద రాష్ట్రం.

పూర్వం దీనిని ఒరిస్సా రాష్ట్రం అని పిలిచేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అమోదించడంతో మార్చి 2011లో రాష్ట్రం పేరు ఒడిషాగా మార్చింది. ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. ఇక్కడ మొత్తం జనాభాలో 40 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నారు. టూరిజం కోణం నుండి ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కోణార్క్‌లోని సూర్య దేవాలయం, భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయం, పూరిలోని జగన్నాథ ఆలయం, అందమైన పూరీ బీచ్ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాయి.

నవీన్ పట్నాయక్ ప్రస్తుతం ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన బిజూ జనతాదళ్ (బిజెడి) నాయకుడు. ఆ రాష్ట్రంలో బిజూ జనతాదళ్ గత 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది. బిజూ జనతాదళ్‌తో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే ఇక్కడ ప్రధాన పార్టీలు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌కు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇక్కడ మరోసారి లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, ఈసారి బిజూ జనతాదళ్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో ఓటింగ్ శాతం ఎంత?

సమాధానం - 73.29% ఓట్లు

ప్రశ్న - ఒడిశాలో మొత్తం లోక్‌సభ స్థానాలు ఎన్ని?

సమాధానం - 21

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి?

సమాధానం - బిజు జనతాదళ్(బీజేడీ)

ప్రశ్న - 2019 ఎన్నికల్లో బిజూ జనతాదళ్ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

సమాధానం: 12 సీట్లు గెలుచుకుంది.

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

సమాధానం - 8

ప్రశ్న - 2014తో పోలిస్తే 2019 ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ నష్టపోయింది?

సమాధానం - బిజు జనతాదళ్. 2014లో 20 సీట్లు గెలవగా, 2019లో 12 సీట్లు దక్కాయి.

ప్రశ్న - 2014 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

సమాధానం: ఒక్క సీటు మాత్రమే గెలిచింది.

ప్రశ్న – 2019లో ఒడిశాలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు ఎన్ని సీట్లు వచ్చాయి?

సమాధానం - 1

ప్రశ్న - 2019 ఎన్నికల్లో ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు ఎంత శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 42.8%.

ప్రశ్న - 2019లో బీజేపీ నేత సంబిత్ పాత్ర ఏ స్థానం నుంచి ఓడిపోయారు?

సమాధానం - పూరి లోక్‌సభ స్థానం

ప్రశ్న - ఒడిశాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఎన్ని లోక్‌సభ స్థానాలు రిజర్వు చేయబడ్డాయి?

సమాధానం - 8 లోక్‌సభ స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి.

ఎన్నికల వీడియో