UPSC Recruitment: యూపీఎస్సీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 69 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి...

UPSC Recruitment: యూపీఎస్సీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Upsc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 27, 2023 | 7:57 PM

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 69 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 69 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రీజినల్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్, అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* రీజినల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మైక్రోబయాలజీ/ వృక్షశాస్త్రం/ ప్లాంట్‌పాథాలజీ/ మైకాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్ కమిషనర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అసిస్టెంట్ ఓర్‌ డ్రెస్సింగ్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్ పోస్టుల విషాయనికొస్తే.. బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అలాగే అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్ పోస్టులకు డిగ్రీ, యూత్ ఆఫీసర్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీని అర్హతగా నిర్ణయించారు.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 13-04-2023ని చవరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..