TS 10th Class Hall Tickets 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

తెలంగాణ పదోతరగతి పబ్లిక్‌ పరీక్ష-2023ల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎస్‌ఎస్‌సీ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది..

TS 10th Class Hall Tickets 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
TS 10th Class Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 24, 2023 | 10:06 PM

తెలంగాణ పదోతరగతి పబ్లిక్‌ పరీక్ష-2023ల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎస్‌ఎస్‌సీ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ ఏప్రిల్‌ 2023 ట్యాబ్‌పై క్లిక్‌ చేసి విద్యార్ధుల జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెగ్యులర్‌, ప్రైవేటు, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్‌ విద్యార్థులందరికి సంబంధించిన హాల్‌ టికెట్లను పొందుపరిచింది.

కాగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.