TS Inter Evaluation 2023: నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూడో విడత మూల్యాంకనం.. కీలక ఆదేశాలు జారీ చేసిన డీఐఈవో
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు వార్షిక పరీక్షలు జరిగాయి. ఇక ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది..
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు వార్షిక పరీక్షలు జరిగాయి. ఇక ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మూడో విడత మూల్యాంకనం ఏప్రిల్ 6న ప్రారంభం కానుందని డీఐఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. నేటి నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకనంలో రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం అధ్యాపకులు విధుల్లో చేరాలని ఆమె సూచించారు.
రసాయనశాస్త్రం లెక్చరర్‌లు జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయం, పద్మానగర్ కరీంనగర్‌లో, వాణిజ్యశాస్త్రం అధ్యాపకులు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల డాక్టర్స్ స్ట్రీట్ కరీంనగర్‌లో గురువారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కావాలని ఆమె సూచించారు. ఇంటర్ బోర్డు నుంచి నియామక పత్రాలు అందిన ప్రతీఒక్కరు మూల్యాంకనం ప్రక్రియలో చేరాలని ఆదేశించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని డీఐఈవో రాజ్యలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.