TS Engineering Special Round Counselling: ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలివే!

|

Aug 18, 2023 | 8:03 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం (ఆగస్టు 17) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన దాదాపు 19,049 సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నాలుగు కొత్త కాలేజీలు, కొత్త కోర్సులు జాయిన్‌ చేయడంతో షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు..

TS Engineering Special Round Counselling: ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలివే!
TS Engineering Special Counseling
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 18: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం (ఆగస్టు 17) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన దాదాపు 19,049 సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నాలుగు కొత్త కాలేజీలు, కొత్త కోర్సులు జాయిన్‌ చేయడంతో షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు.

దీంతో ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో ఆగస్టు 17 నుంచి 22 వరకు ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవడానికి ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్ధులకు ఆగస్టు 26న ప్రత్యేక విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులందరూ ఆగస్టు 27 నుంచి ఆగస్టు 29 వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. ఇక స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు ఆగస్టు 26న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న174 కాలేజీల్లో 83,766 కన్వినర్‌ కోటా సీట్లు, 33 వేలు యాజమాన్య కోటా సీట్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ పాఠ్యాంశం తొలగింపుపై నివేదిక

స్కూల్‌ పాఠ్యాంశాల నుంచి ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌ తొలగింపుపై నివేదిక కోరుతూ భారత విద్యా మంత్రిత్వశాఖ ఓ కమిటీని నియమించింది. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఎఫ్‌ఎస్‌ఈ) ప్రిడ్రాఫ్ట్‌ కమిటీ నివేదిక ప్రకారం.. దేశంలోని అన్ని పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతుల్లోని ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌ను తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ సబ్జెక్టుకు బదులుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘వరల్డ్ అరౌండ్ అస్’ సబ్జెక్ట్‌ను పాఠ్యాంశాల్లో చేర్చనున్నారు. ఎన్‌సీఎఫ్‌ఎస్‌ఈ మార్గదర్శకాల మేరకు కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారు. కానీ పర్యావరణ సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఈవీఎస్‌ సబ్జెక్ట్‌ కీలక పాత్ర పోషిస్తుందని, దీనిని తొలగిస్తే వారికి ఆయా విషయాలు ఎలా తెలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.