UPSC Civils Free Coaching: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023కు ఉచిత కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్! ఈ ఏడాది నిర్వహించనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి..
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్! ఈ ఏడాది నిర్వహించనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) ప్రకటన విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (సీఎస్‌ఈ-ఆర్‌సీ- 2023) ద్వారా ఈ ఏడాది మేలో జరిగే ప్రాథమిక పరీక్షకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆసక్తి కలిగిన మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు జనవరి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ లో పూరించవచ్చు. లేదా 9849098620, 9441428108 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని ఇన్‌ఛార్జి హెచ్ అలీమ్‌బాషా సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.