Ukraine Students: ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు అవకాశం.
యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై ఎంతలా ప్రభావం చూపిందో అక్కడ వైద్య విద్యనభ్యసించిన మన విద్యార్థులపై ప్రభావం చూపింది. యుద్ధం కారణంగా భారత్ నుంచి యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల్లో చాలా మంది గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి వచ్చిన విషయం..
యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై ఎంతలా ప్రభావం చూపిందో అక్కడ వైద్య విద్యనభ్యసించిన మన విద్యార్థులపై ప్రభావం చూపింది. యుద్ధం కారణంగా భారత్ నుంచి యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల్లో చాలా మంది గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఆపరేషన్ గంగ’’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలలో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చింది. అయితే ఎంబీబీఎస్ పూర్తవ్వకముందే స్వదేశానికి తిరిగొచ్చిన విద్యార్థుల భవితత్వం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్‌ను క్లియర్ చేయడానికి అవకాశాన్ని కల్పించింది. థియరీతో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను ఒకేసారి పూర్తి చేసేలా అవకాశం కల్పించనున్నట్లు మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఏడాదిలో ప్రాక్టికల్, థియరీ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ మెడికల్ కాలేజీల్లోనూ ఎన్‌రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ రెండు పరీక్షలను పూర్తి చేసిన విద్యార్థులు.. భారత్ లో రెండేళ్ల రోటరీ ఇంటర్న్‌షిప్‌పు కచ్చితంగా చేయాలని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే మొదటి ఏడాది ఇంటర్నషిప్ ఉచితంగా చేయాల్సి ఉంటుంది. రెండో ఏడాది స్టైఫండ్ చెల్లించనున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ మెడికల్ కాలేజీలో ఎన్‌రోల్ కావాల్సిన అవసరం లేకుండా ఎంబీబీఎస్ పరీక్షలను పూర్తి చేసే అవకాశం కల్పించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..