Central Bank of India Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000ల ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులున్నాయంటే..
CBI Recruitment 2023: ముంబాయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రీజియన్లవారీగా సీబీ శాఖల్లో.. 5,000ల అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో..
ముంబాయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రీజియన్లవారీగా సీబీ శాఖల్లో.. 5,000ల అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్‌లో 141 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 8వ/10వ/12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీలో తెలుగు సబ్జెక్టుతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు మార్చి 31, 2023వ తేదీ నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ ఆర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 3, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.10,000 (రూరల్/సెమీ అర్బన్ బ్రాంచ్‌లు) రూ.12,000 (అర్బన్ బ్రాంచ్), రూ.15,000 (మెట్రో బ్రాంచ్)తోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. అప్రెంటిస్‌షిప్ పూర్తయిన అభ్యర్థులకు అసెస్‌మెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీంట్లో థియరెటికల్ పార్ట్, ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ కాంపొనెంట్ ఉంటాయి. బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా థియరీ అసెస్‌మెంట్‌ను, ప్రాక్టికల్ అసెస్‌మెంట్‌ను సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తుంది. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఎఫ్‌ఎస్‌ఐ ఎస్‌ఎస్‌సీ సంయుక్తంగా అభ్యర్థులకు అందజేస్తాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.