Ather EV Scooter: ఓలాకు పోటీగా ఎథర్‌ నుంచి మరో మూడు నయా ఈవీ స్కూటర్లు.. రేపే రిలీజ్‌..!

ఈవీ మార్కెట్‌లో ఓలా తన హవా చూపుతుంది. డిజైన్‌తో పాటు ఫీచర్లపరంగా కూడా ఆకట్టుకోవడంతో భారతదేశ ఈవీ మార్కెట్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలంటే ముందుగానే బుక్‌ చేసుకోవాలి. తాజాగా ఓలాకు పోటీగా ఎథర్‌ కంపెనీ మూడు కొత్త ఈవీలను రిలీజ్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. అంతేకాదు ఈ లాంచ్‌ ఈవెంట్‌ కూడా ఆగస్టు 11 అంటే శుక్రవారమే ఉంటుందని పేర్కొంది.

Ather EV Scooter: ఓలాకు పోటీగా ఎథర్‌ నుంచి మరో మూడు నయా ఈవీ స్కూటర్లు.. రేపే రిలీజ్‌..!
Ather 450s
Follow us

|

Updated on: Aug 10, 2023 | 9:00 PM

భారతదేశంలో ఈవీ స్కూటర్ల జోరు నడుస్తుంది. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈవీ స్కూటర్లు క్రమేపి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా వాడుతున్నారు. భారతదేశంలో ఈవీ మార్కెట్‌లో ఓలా తన హవా చూపుతుంది. డిజైన్‌తో పాటు ఫీచర్లపరంగా కూడా ఆకట్టుకోవడంతో భారతదేశ ఈవీ మార్కెట్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలంటే ముందుగానే బుక్‌ చేసుకోవాలి. తాజాగా ఓలాకు పోటీగా ఎథర్‌ కంపెనీ మూడు కొత్త ఈవీలను రిలీజ్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. అంతేకాదు ఈ లాంచ్‌ ఈవెంట్‌ కూడా ఆగస్టు 11 అంటే శుక్రవారమే ఉంటుందని పేర్కొంది. కాబట్టి ఎథర్‌ రిలీజ్‌ చేసే ఆ మూడు స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం భారతదేశ మార్కెట్‌లో ఎథర్‌ కంపెనీ కేవలం 450 ఎక్స్‌ స్కూటర్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇప్పుడు తన లైనప్‌లో మరో మూడు స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో ఒకటి 450 ఎస్‌ కాగా మిగిలిన రెండు స్కూటర్లు 450 ఎక్స్‌కు అప్‌డేట్‌ వెర్షన్స్‌ అని తెలుస్తుంది. ఎథర్‌ స్కూటర్‌ మిగిలిన ఫీచర్లు బాగానే ఉన్నా చార్జింగ్‌ చాలా ఎక్కువని యూజర్లు తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం రిలీజ్‌ చేసే స్కూటర్లలో చార్జింగ్‌ సమయం చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం బ్యాటరీ పరిమాణాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ పరిమాణం తగ్గించడానికే 450 ఎక్స్‌ అప్‌డేట్‌ చేసి ఉంటారని పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎథర్‌ కంపెనీ స్పందించలేదు. అయితే ప్రస్తుతం అందరి చూపు ఎథర్‌ 450 ఎస్‌ వెర్షన్‌పై ఉంది. ఈ 450 ఎస్‌ వెర్షన్‌లో వచ్చే ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం. 

ఎథర్‌ 450 ఎస్‌ లుక్స్‌పరంగా చూస్తే 450 ఎక్స్‌ మాదిరిగానే ఉంది. ఈ స్కూటర్‌ స్పెషల్‌ కలర్‌ ఎలిమెంట్స్‌తో ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. 450 ఎస్‌ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే 115 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ గంటకు 90 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోనుంది. అయితే ఈ స్కూటర్‌లో 450 ఎక్స్‌ మోటర్‌నే ఉపయోగించినట్లు టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..