Top SUVs Under 8L: తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకొంటున్నారా? ఈ బెస్ట్ ఎస్‍యూవీలపై ఓ లుక్కేయండి..
సాధారణంగా ఎస్యూవీ కారు అనగానే భారీ బడ్జెట్ మన కళ్ల ముందు మెదలుతుంది. అయితే తక్కువ ధరలోనే మంచి ఎస్‌యూవీలు మనకు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఎనిమిది లక్షల లోపు ధరలోనే అవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..
ఇటీవల కాలంలో కారు ఒక లగ్జరీ వస్తువులా కాకుండా అవసరంలా మారిపోయింది. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో సొంత కార్లలోనే ప్రయాణాలు చేయడానికి అందరూ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అందరూ కార్లు కొనుగోలు చేస్తున్నారు. వీటిల్లో ఎక్కువగా ఎస్యూవీ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసేందుకు ఇవి సౌకర్యవంతంగా ఉంటుండటంతో వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే ఆటోమొబైల్ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం కార్ల విక్రయాల్లో ప్రస్తుతం 40 శాతం వాటాను ఈ ఎస్యూవీ లే ఉంటున్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. సాధారణంగా ఎస్ యూవీ అనగానే భారీ బడ్జెట్ మన కళ్ల ముందు మెదలుతుంది. అయితే తక్కువ ధరలోనే మంచి ఎస్‌యూవీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే కేవలం ఎనిమిది లక్షల లోపు ధరలోనే అవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆ ఎస్‌యూవీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
టాటా పంచ్ @ రూ. 5.99 లక్షలు.. ఈ కారు టాటా మోటార్స్ లో ప్రారంభ స్థాయి ఎస్యూవీ. దీని ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ రూ. 5.99 లక్షలు. కంపెనీ ఈ మైక్రో ఎస్‌యూవీని వారి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో వలె అదే ధర శ్రేణిలో అందిస్తోంది. ఈ కారు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కస్టమర్ బేస్‌ను కూడా కలిగి ఉంది. ఇది ఒకే ఇంజన్తో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ తో వస్తోంది.
నిస్సాన్ మాగ్నైట్ @ రూ. 5.99 లక్షలు.. భారతీయ మార్కెట్లో నిస్సాన్ కంపెనీకి ఈ మాగ్నైట్ ఒక బ్రేకవుట్ లాంటింది. నిస్సాన్ నుండి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ సమకాలీన జపనీస్ రూపాలను కలిగి ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. ఇది టాటా పంచ్‌తో పాటు భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన ఎస్‌యూవీగా మారింది. నిస్సాన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మాగ్నైట్‌ను అందిస్తుంది, 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లతో వస్తోంది.
రెనాల్ట్ కైగర్ @ రూ. 6.49 లక్షలు.. భారతీయ మార్కెట్లో రెనాల్ట్ కంపెనీ నుంచి ఎంట్రీ లెవల్ ఎస్యూవీ ఇది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షలు. రెనాల్ట్ కైగర్‌ను రెండు ఇంజన్ ఎంపికలతో అందిస్తుంది. 1.0L పెట్రోల్ ఇంజన్, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మరో ఇంజన్ 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVTతో వస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ @ రూ. 7.68 లక్షలు.. భారతీయ మార్కెట్లో కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ నుంచి ఎంట్రీ లెవల్ ఎస్యూవీ. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.68 లక్షలు. మూడు ఇంజన్ ఎంపికలతో ఇది వస్తోంది. 114.41 bhp, 250 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5L డీజిల్ ఇంజన్, 81.86 bhp, 114 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2L పెట్రోల్ ఇంజన్, 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ b21 ఇంజన్.
కియా సోనెట్ @ రూ. 7.79 లక్షలు.. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షలు. ఇది బహుశా భారతీయ మార్కెట్లో అత్యుత్తమంగా కనిపించే సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ. కియా, హ్యుందాయ్ వెన్యూ వంటి ఇంజన్ ఎంపికలతో సోనెట్‌ను అందిస్తుంది. ఆఫర్‌లో ఉన్న ఇంజన్‌లు 81.86 bhp, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2L పెట్రోల్ ఇంజన్, 114.41 bhp , 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..