Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? ఈ 3 మార్పుల గురించి తెలుసుకోండి!

బ్యాంకుల్లో మాదిరిగానే పోస్టాఫీసులోనూ జాయింట్ ఖాతా తెరిచే అవకాశం ఉంది. జాయింట్ అకౌంట్ తెరవడానికి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఈ మార్పు తర్వాత ఇప్పుడు మూడుకు పెంచారు. అంటే పోస్టాఫీసులో ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి పొదుపు ఖాతాను తెరవవచ్చు అన్నట్లు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు చేశారు..

Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? ఈ 3 మార్పుల గురించి తెలుసుకోండి!
Post Office
Follow us

|

Updated on: Aug 22, 2023 | 5:46 PM

పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి.పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా సవరణ పథకం. దీనిలో ఇటీవల 3 మార్పులు తీసుకువచ్చింది పోస్టల్‌ శాఖ. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ-గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులను వెల్లడించింది. ఖాతాదారుల సంఖ్య, ఖాతా నుంచి నగదు ఉపసంహరణ, ఖాతాలోని డబ్బుపై వడ్డీ, ఈ మూడు అంశాలు మారాయి.

పోస్టాఫీసు ఖాతాదారుల సంఖ్యలో మార్పు:

బ్యాంకుల్లో మాదిరిగానే పోస్టాఫీసులోనూ జాయింట్ ఖాతా తెరిచే అవకాశం ఉంది. జాయింట్ అకౌంట్ తెరవడానికి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఈ మార్పు తర్వాత ఇప్పుడు మూడుకు పెంచారు. అంటే పోస్టాఫీసులో ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి పొదుపు ఖాతాను తెరవవచ్చు అన్నట్లు.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి నియమాలు:

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు చేశారు. 50 రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకునేందుకు ఫారం-2 నింపి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం.. ఫారం-2కి బదులు ఫారం-3 నింపి పాస్‌బుక్‌తో పాటు సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

పోస్టాఫీసు ఖాతాలో డిపాజిట్‌పై వడ్డీ:

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారుడు మరణిస్తే అతని మరణానికి ముందు నెలాఖరు వరకు మాత్రమే వడ్డీ చెల్లించేది. ఇప్పుడు సవరించిన నియమం ప్రకారం.. ఖాతాదారు మరణం తర్వాత ఆ నెల వరకు కూడా వడ్డీ చెల్లిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి