Maruti Suzuki EVX: మారుతీ సుజుకీ ఆల్ ఎలక్ట్రిక్ కూపే.. స్పెయిన్‌లో టెస్టింగ్.. విడుదల ఎప్పుడంటే..?
ఈ మోడల్‌ను మొదట భారతదేశంలో ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. అయితే పలు దేశాల్లో ఈ కారును పరీక్షించిన పలు సందర్భాల్లో ఈ కారును గుర్తించారు. ఇటీవల ఈ కచ్చితమైన ఎస్‌యూవీ మరొక టెస్ట్ మ్యూల్ స్పెయిన్‌లో పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ వివరాలు మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. ఎమోషనల్ వెర్సటైల్ క్రూయిజర్ అని కూడా పిలిచే ఈవీఎక్స్ మారుతి సుజుకికి సంబంధించిన మొట్టమొదటి ఈవీగా పేర్కొంటున్నారు. ఇది కూపే లాంటి ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్, ఇండియన్ మార్కెట్‌ల కోసం తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనంపై పని చేస్తోందనే వాస్తవం మనందరికీ తెలుసు. ఈ మోడల్‌ను ఈవీఎక్స్ అని పిలుస్తారు. ఈ మోడల్‌ను మొదట భారతదేశంలో ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. అయితే పలు దేశాల్లో ఈ కారును పరీక్షించిన పలు సందర్భాల్లో ఈ కారును గుర్తించారు. ఇటీవల ఈ కచ్చితమైన ఎస్‌యూవీ మరొక టెస్ట్ మ్యూల్ స్పెయిన్‌లో పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ వివరాలు మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. ఎమోషనల్ వెర్సటైల్ క్రూయిజర్ అని కూడా పిలిచే ఈవీఎక్స్ మారుతి సుజుకికి సంబంధించిన మొట్టమొదటి ఈవీగా పేర్కొంటున్నారు. ఇది కూపే లాంటి ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ తాజా ఈవీఎక్స్ అభివృద్ధి చివరి దశలో ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎస్‌యూవీ స్పెయిన్‌లో పరీక్షిస్తున్న సమయంలో ఈ కారు డిజైన్ గురించి అందరికీ తెలిసింది. ఈ ఈవీఎక్స్ జనవరి 2024 నాటికి ప్రారంభించే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారు గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
మారుతీ ఈవీఎక్స్ తాజా ఫొటోలను పరిశీలిస్తే ఈ ఎస్‌యూవీ పొడవు 4,300ఎంఎం, వెడల్పు 1,800ఎంఎం, ఎత్తు 1,600 ఎంఎంగా ఉంటుందని తెలుస్తుంది. ఈవీఎక్స్‌లో క్రోమ్ బార్, సాధారణ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. రాబోయే ఈ ఎస్‌యూవీ టాప్-స్పెక్ వెర్షన్‌లలో కంపెనీ ఈ లైట్లను ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్‌కి అప్‌గ్రేడ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ రాబోయే ఎస్‌యూవీ గణనీయంగా మరింత ఆధునిక, అధునాతనంగా కనిపించే ఇంటీరియర్‌తో అమర్చబడిందని గత ఇమేజ్‌లను బట్టి తెలుస్తుంది.
ఈ కారు రెండు-స్పోక్ ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యాష్‌బోర్డ్‌లో కొత్త డిస్‌ప్లే యూనిట్, సరికొత్త డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్తగా రోటరీ డయల్‌తో పాటు సెంటర్ కన్సోల్‌ను రూపొందించారు. ప్రస్తుతానికి ఈ రాబోయే ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఇది సరికొత్త డెడికేటెడ్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నట్లు నివేదకలు బట్టి తెలుస్తుంది. ఈ నివేదికల ప్రకారం తుది ఉత్పత్తి-స్పెక్ సుజుకి ఈవీఎక్స్ మోడల్ 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు సుమారుగా 500-520 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..