Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్‌.. వచ్చే వారం బ్యాంకులకు 2 రోజులు సెలవులు.. ఏయే తేదీలంటే..?

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని రకాల బ్యాంకులు దాదాపుగా సెలవులో ఉన్నట్లే. అలాగే మార్చి 25న అంటే శనివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఎందుకంటే..

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్‌.. వచ్చే వారం బ్యాంకులకు 2 రోజులు సెలవులు.. ఏయే తేదీలంటే..?
అటు ఈ 12 సెలవు దినాల్లో 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు.. మరో ఆరు పండుగ రోజులు ఉన్నాయి
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 19, 2023 | 8:06 PM

వచ్చేవారం అంటే మార్చి నాలుగో వారంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ రోజులలో బ్యాంక్ బ్రాంచ్‌లలో ఎటువంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఆ కారణంగా మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే.. ఈ సెలవులకు అనుగుణంగా షెడ్యూల్ చేసుకోండి. లేకపోతే బ్యాంక్‌కు వెళ్లి ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావల్సి ఉంటుంది. విషయంలోకి వెళ్లే మార్చి నాలుగో వారంలో బ్యాంకులకు రెండు సెలవులు ఉన్నాయి. మార్చి 22న అంటే బుధవారం ఉగాది పండుగ. తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరం ఉగాది రోజునే ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాలలోని అన్ని రకాల బ్యాంకులు దాదాపుగా సెలవులో ఉన్నట్లే. అలాగే మార్చి 25న అంటే శనివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మార్చి నెలకు నాల్గో శనివారం. అందువల్ల బ్యాంక్‌లో  ఏదైనా పని ఉన్నవారు ఈ రెండు తేదీలను గుర్తుంచుకోవాలి. అంటే వచ్చే వారం కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు హాలిడే ఉంది.

అయితే మార్చి నెలలో చివరి వారంలో గమనిస్తే.. 30వ తేదీన శ్రీరామ నవమి పండుగ ఉంది. ఆ రోజున కూడా బ్యాంక్ హాలిడే ఉంటుంది. ఇకపోతే బ్యాంక్ హాలిడే ఉన్నా కూడా బ్యాంక్ సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ వంటి పలు సేవలను బ్యాంక్ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు.  మనీ ట్రాన్స్‌ఫర్ దగ్గరి నుంచి అకౌంట్ ఓపెనింగ్ వరకు దాదాపుగా చాలా సేవలు ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి.

కానీ బ్యాంక్‌లో పని ఉన్న‌వారు మాత్రం కచ్చితంగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిందే. అందుకే ఇలాంటి వారు మాత్రం కచ్చితంగా బ్యాంక్ హాలిడే ఎప్పుడు ఉందనేది తెలుసుకొని అడుగు బయటకు వేయాలి. కాగా బ్యాంక్ హాలిడేస్ అనేవి ప్రాంతం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక రోజు హాలిడే ఉంటే.. మరో రాష్ట్రంలో మరొక రోజు సెలవు ఉండవచ్చు. ఇలా ప్రాంతం ప్రాతిపదికన బ్యాంక్ సెలవుల్లో మార్పు ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని కూడా బ్యాంక్ కస్టమర్లు గుర్తించుకోవాలి. దేశీ కేంద్ర బ్యాంక్ ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయనే వివరాల కోంస ముందే ఒక క్యాలెండర్ రెడీ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి.