GT Drive pro: సిటీ అవసరాలకు తిరుగులేని బైక్, ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిమీలు ప్రయాణించవచ్చు..

జీటీ ఫోర్స్ కంపెనీ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రదర్శించింది. జీటీ డ్రైవ్ ప్రో పేరుతో ఈ స్కూటర్ తీసుకొచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన నాలుగు కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

GT Drive pro: సిటీ అవసరాలకు తిరుగులేని బైక్, ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిమీలు ప్రయాణించవచ్చు..
Gt Drive Pro Electric Scooter
Follow us
Madhu

|

Updated on: Mar 27, 2023 | 12:01 PM

విద్యుత్ వాహన శ్రేణిలో కార్లు, మోటార్ బైక్ లు మార్కెట్ కు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వాటికున్న డిమాండ్ కు అనుగుణంగా కంపెనీలు అత్యాధునిక సాంకేతికతో కూడిన వాహనాలను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇదే క్రమంలో జీటీ ఫోర్స్ కంపెనీ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రదర్శించింది. జీటీ డ్రైవ్ ప్రో పేరుతో ఈ స్కూటర్ తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అత్యాధునిక ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన నాలుగు కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలోని బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ఆ జీటీ ఫోర్స్ కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు రకాల బ్యాటరీలతో..

జీటీ డ్రైవ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రకాల బ్యాటరీ వేరియంట్లో వస్తోంది. ఒకటి లెడ్ యాసిడ్ బ్యాటరీ కాగా.. మరొకటి లిథియం అయాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీలు ఏదైనా ఒకసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. లెడ్ యాసిడ్ సెల్ పూర్తి చార్జింగ్ అవడానికి 7 నుంచి 8 గంటలు, లిథియం,అయాన్ బ్యాటరీ చార్జింగ్ కు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ముందువైపు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ అమర్చారు. ముందువైపు చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో మొబైల్, చిన్న హ్యాండ్ బ్యాగ్, సానిటైజర్ వంటివి పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్ లోని ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్. ఇందుల బ్యాటరీ లెవెల్, రైడింగ్ మోడ్, ఓడో మీటర్ డిస్ ప్లే అవుతుంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్ అమర్చారు. వెనుకవైపు హాలోజెన్ టెయిల్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్స్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ బైక్ ఆకర్షణీయమైన చాకొలేట్, రెడ్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కుటుంబ అవసరాలకు ప్రాధాన్యం..

జీటీ డ్రైవ్ ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్ కుటుంబాల అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. మహిళలు, పనివారు, కళాశాల విద్యార్థులకు సూట్ అవుతుంది. ఇది తక్కువ వేగంతోనే ప్రయాణిస్తుంది. గంటకు కేవలం 25 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తుంది. జిటి డ్రైవ్ ప్రొ లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 67,208, లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 82,751 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..