Cars launch in April: వచ్చే నెలలో లాంచ్ కానున్న బెస్ట్ మోడల్ కార్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కూడా వచ్చే ఏప్రిల్ మాసంలో పలు కొత్త కార్లు లాంచ్ కాబోతున్నాయి. వాటిల్లో మారుతి సుజుకి, ఎంజీ వారి ఎలక్ట్రిక్ వేరియంట్, లగ్జరీ కార్ మేకర్స్ అయిన మెర్సిడెస్ బెంజ్, లంబోర్ఘిని వంటి బ్రాండ్ మోడళ్ల కార్లు కూడా ఉన్నాయి.
మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ ఒకటి నుంచి చాలా రూల్స్ మారిపోతాయి. కొత్త నియమాలు, నిబంధనలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన కార్యకలాపాల్లో ఇవి ప్రస్పుటంగా కనిపిస్తాయి. అలాగే కొత్త కొత్త లాంచ్ లు కూడా ఉంటాయి. ముఖ్యంగా కార్లు, బైక్ లు మార్కెట్ కు క్యూ కడతాయి. మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కూడా ఈ ఏప్రిల్ మాసంలో పలు కొత్త కార్లు లాంచ్ కాబోతున్నాయి. వాటిల్లో మారుతీ సుజుకీ, ఎంజీ వారి ఎలక్ట్రిక్ వేరియంట్, లగ్జరీ కార్ మేకర్స్ అయిన మెర్సిడెస్ బెంజ్, లంబోర్ఘిని వంటి బ్రాండ్ మోడళ్ల కార్లు కూడా ఉన్నాయి. అలాగే పలు వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, నిస్సాన్, హ్యుందాయ్తో పాటు అనేక సంస్థల మోడల్స్ ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఏప్రిల్ లాంచ్ కానున్న టాప్ 4 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్.. ఆటో ఎక్స్పో2023 లో భారతీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ అయిన మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్‌కు బుకింగ్స్ పరంగా మంచి డిమాండ్ కనిపిస్తోంది. దీని ఫ్రెంట్ ఫేస్.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాను పోలి ఉంటుంది. కాగా.. బ్రెజ్జాతో పోల్చుకుంటే దీని సైజు తక్కువగా ఉంది. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాహనాలకు ఈ ఫ్రాంక్స్ గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో 1.0 లీటర్ కే సిరీస్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్ ఉంటుంది. స్మార్ట్ హైబ్రీడ్ టెక్నాలజీ దీని సొంతం. 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏప్రిల్ మధ్యలో ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఎంజీ కామెట్ ఈవీ.. వాస్తవానికి ఈ కామెట్ ఈవీని ఆటో ఎక్స్‌పోలో ఎంజీ మోటార్ లాంచ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేసింది. ఎట్టకేలకు దీనిని ఏప్రిల్ చివర్లో ఆవిష్కరించనున్ననట్లు తెలుస్తోంది . ఎంజీ మోటార్ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ కామెట్ ఈవీ. మొదటిది జెడ్ఎస్ ఈవీ. సైజు పరంగా ఈ కామెట్ ఈవీ చాలా చిన్నది. లాంచ్అనంతరం ఇండియాలో అతి చిన్న ఈవీగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఈ ఎంజీ కామెట్ ఈవీకి సంబంధించిన బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే.. ఇందులో 20కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250-300 కి.మీల దూరం ఇది ప్రయాణిస్తుందని చెబుతున్నారు.
మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 ఎస్ ఈ పర్ఫార్మెన్స్.. ఏప్రిల్‌లో లాంచ్ అవుతున్న లగ్జరీ కార్లలో ఈ మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 ఎస్ ఈ పర్ఫార్మెన్స్ ఒకటి. ఏప్రిల్ 11 ఇది ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ఫార్ములా వన్ స్ఫూర్తితో దీనిని రూపొందించారు. ఇందులో 4.0 లీటర్ వీ8 టర్బో ఇంజిన్- ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఏఎంజీ కార్లలో ఇదే ది మోస్ట్ పవర్ఫుల్ మోడల్! ఈ ఇంజిన్.. 843 హెచ్‌పీ పవర్‌ను, 1400 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్‌ను అందుకోవడానికి కేవలం 2.9సెకన్లే పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 316 కిలోమీటర్లు
లంబోర్ఘిని ఉరుస్ ఎస్.. గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు.. ఈ లగ్జరీ ఎస్యూవీ భారత్ మార్కెట్లోకి ఏప్రిల్ 11న అండుగుపెట్టనుంది. లంబోర్ఘినికి ఇది ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది 666 హెచ్‌పీ పవర్‌ను, 850 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 305 కేఎంపీహెచ్. 0-100 కేఎంపీహెచ్‌ను కేవలం 3.5 సెకన్లలో అందుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..