Hikes In FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. ఎఫ్‌డీలపై అదిరిపోయే అప్‌డేట్…

తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తమ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిటర్లకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వివరించింది.

Hikes In FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. ఎఫ్‌డీలపై అదిరిపోయే అప్‌డేట్…
Fixed Deposit
Follow us

|

Updated on: May 14, 2023 | 5:00 PM

పొదుపు చేసుకున్న సొమ్మును నికరమైన రాబడి కోసం వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వారు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని చెబుతారు. ఎందుకంటే నికరమైన వడ్డీతో పాటు పెట్టుబడికి భరోసా ఉంటుందని ఎఫ్‌డీల వైపు చాలా మంది మొగ్గు చూపుతారు. అయితే గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను గణనీయంగా పెంచుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో రెపో రేట్లను యథాతథంగా ఉంచడంతో ప్రస్తుతం బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచడం లేదు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇంకా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తమ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిటర్లకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వివరించింది. ఈ పెంపు తర్వాత సాధారణ ప్రజలకు ఎఫ్‌డీ వడ్డీ రేటు 7.25 శాతానికి చేరింది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం వరకూ వడ్డీ రేటు పెరిగింది. అలాగే పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు మే 12, 2023 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా పెరిగిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

సాధారణ ప్రజలకు పెంపు ఇలా

బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడు-45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే 46-210 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీ రేటును  అందుస్తుంది. 211 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 6.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ చేస్తుంది. రెండు సంవత్సరాల పైన మూడు సంవత్సరాల వరకు 7.05 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మూడు నుంచి పదేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై మాత్రం 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 399 రోజుల కాలవ్యవధి కోసం బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్‌గా పేర్కొన్న ప్రత్యేక డిపాజిట్‌పై బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

సీనియర్ సిటిజన్లకు ఇలా

7 -45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 46 రోజుల నుండి 180 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు 5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 81-210 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూరయ్యే డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేటును పొందుతారు.సీనియర్ సిటిజన్లు ఏడాది నుంచి రెండేళ్లలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 7.55 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇంతకుముందు ఈ పదవీకాలంపై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉండేది. బ్యాంకు మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7.15 శాతం, 5 సంవత్సరాల కంటే ఎక్కువ మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7.55 శాతం వడ్డీని అందిస్తుంది. 399 రోజుల కాలవ్యవధికి బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్‌గా పేర్కొన్న ప్రత్యేక డిపాజిట్‌పై, బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..