Gold Cost in 2023: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త సంవత్సరంలో 10 గ్రాములు.. 60 వేలకు చేరనున్నదట..

డాలర్ మరింతగా బలపడడంతో రోజు రోజుకీ పసిడి ధర పైపైకి వెళ్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కొత్త ఏడాదిలో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికీ షాక్ ఇచ్చే వార్తను చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. అవును మహిళామణులకు వెరీవెరీ బ్యాడ్‌ న్యూస్‌. లేడీస్‌ ఎంతగానో ఇష్టపడే ఆర్నమెంట్‌ రేట్స్‌ అమాంతం పెరగబోతున్నాయట.

Gold Cost in 2023: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త సంవత్సరంలో 10 గ్రాములు.. 60 వేలకు చేరనున్నదట..
Gold Price Hike 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2022 | 9:53 PM

భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ తమ స్థాయికి తగినట్లు బంగారం కొనుగోలుపై ఆసక్తిని చూపిస్తారు. బంగారం నగలు అలంకరణ కోసం మాత్రమే కాదు.. తమకు ఎప్పుడైనా అనుకోని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే బంగారం ఆదుకుంటుందని భావిస్తారు. అయితే కరోనా తర్వాత బంగారం పై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా వివాహాదిశుభకార్యాలలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే బంగారం ధరల్లో హెచ్చ తగ్గులుంటాయి. దీని కారణం.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ మరింతగా బలపడడంతో రోజు రోజుకీ పసిడి ధర పైపైకి వెళ్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కొత్త ఏడాదిలో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికీ షాక్ ఇచ్చే వార్తను చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. అవును మహిళామణులకు వెరీవెరీ బ్యాడ్‌ న్యూస్‌. లేడీస్‌ ఎంతగానో ఇష్టపడే ఆర్నమెంట్‌ రేట్స్‌ అమాంతం పెరగబోతున్నాయట. వివరాల్లోకి వెళ్తే..

అవును, ఇది నిజంగానే మహిళలకు బ్యాడ్ న్యూస్‌. ఎందుకంటే, న్యూఇయర్‌లో గోల్డ్‌ రేట్‌ 60వేల రూపాయలకు చేరబోతుందట. మార్కెట్‌ అనలిస్టుల అంచనా ప్రకారం 10 గ్రాముల బంగారం 60వేలు దాటేస్తుందంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయ్‌. 2023లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. గోల్డ్‌ను సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించడమే అందుకు కారణమంటున్నారు. అంతర్జాతీయంగా కొనుగోళ్లు పెరిగితే, భారత్‌లో బంగారం ధర 60వేల రూపాయలు దాటేయడం ఖాయమంటున్నారు మార్కెట్‌ అనలిస్టులు. అంతర్జాతీయంగా ఔన్స్‌ గోల్డ్‌ ధర 2వేల డాలర్లకు చేరే అవకాశం కూడా ఉందనేది ఒక అంచనా.

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ మొదలైన తర్వాత గోల్డ్‌ రేట్స్‌ పెరుగుతూ వచ్చాయి. మరోవైపు రూపాయి విలువ దారుణంగా పడిపోతుండటం… గోల్డ్‌ రేట్‌ పెరగడానికి మరో కారణంగా చెబుతున్నారు. 2023 ప్రారంభంలో సడన్‌గా ధరల్లో మార్పు రాకపోయినా, ఆ తర్వాత కచ్చితంగా బంగారం రేట్లలో మార్పు వస్తుందంటున్నారు. నెక్ట్స్‌ ఇయర్‌ ఫస్ట్‌ హాఫ్‌లో 57వేల వరకూ వెళ్లి, ఆ తర్వాత 60వేలకు తాకుతుందని చెబుతున్నారు. అమెరికా-చైనా మధ్య ట్రేడింగ్‌ వార్‌, రష్యా-ఉక్రెయిన్‌ వార్‌, బంగారం కొనుగోళ్లపై బ్యాంకుల ఫోకస్‌ పెడితే… గోల్డ్‌ రేట్స్‌ ఊహించనివిధంగా పెరిగిపోవడం ఖాయమంటున్నారు మార్కెట్‌ అనలిస్టులు. 2023లో బంగారం డిమాండ్ నిలకడగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ..  US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును మరింత కఠినతరం చేయడం వల్ల కనీసం వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో పసుపు మెటల్ ధరలపై ప్రభావం చూపవచ్చు అని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..