Gold Price Today: వరుసగా రెండోరోజు షాకిచ్చిన గోల్డ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

|

Mar 25, 2023 | 5:55 AM

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే తాజాగా శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే...

Gold Price Today: వరుసగా రెండోరోజు షాకిచ్చిన గోల్డ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price
Follow us on

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే గురువారం తగ్గినా.. మరలా శుక్రవారం నుంచి పెరగడం మదలదైంది. ఈ రోజు తులం బంగారంపై ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,650 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650 వద్ద నమోదైంది.

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 60,000 వద్ద ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం దేశంలో కిలో వెండిపై రూ. 400 వరకు పెరిగింది. ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700, ముంబైలో రూ. 73,000, ఢిల్లీలో రూ. 73,000, కోల్‌కతాలో కిలో వెండి రూ. 73,000 బెంగళూరులో రూ.75,700, హైదరాబాద్‌లో రూ.75,700, విశాఖ, విజయవాడలో రూ.75,400 వద్ద ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..