తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే

|

Mar 25, 2023 | 10:01 AM

ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి తాపాన్ని తట్టుకోవాలంటే.. ఫ్యాన్ గాలి సరిపోదు.. కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. మరి అందరూ ఏసీలు కొనుక్కోలేరు కదా..

ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి తాపాన్ని తట్టుకోవాలంటే.. ఫ్యాన్ గాలి సరిపోదు.. కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. మరి అందరూ ఏసీలు కొనుక్కోలేరు కదా.. అందుకే మార్కెట్‌లో మధ్యతరగతి వాళ్లు కూడా కొనుక్కోగలిగే పోర్టబుల్‌ ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మీ గదిలో ఏ చిన్న ప్లేస్‌లోనైనా పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా ఈజీగా చక్రాల సాయంతో తీసుకెళ్లొచ్చు. వాస్తవానికి గోడకు అమర్చే ఏసీ.. కేవలం ఒక్క గదిని మాత్రమే చల్లబరుస్తుంది. అదే పోర్టబుల్ ఏసీతో.. మొత్తం ఇంటిని కూల్ చేయవచ్చు. అంతేకాకుండా దీన్ని ఇంటి అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మామూలు ఏసీతో పోల్చితే ఈ పోర్టబుల్ ఏసీల ధర చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో లభించే ఈ పోర్టబుల్ ఏసీల నుంచి సౌండ్‌ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ నిద్రకు కూడా ఆటంకం ఉండదు. ఇక పోర్టబుల్ AC సామర్థ్యాన్ని పరిశీలిస్తే 0.5 నుంచి 1.5 టన్ను వరకు ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే 8 వేల రూపాలయనుంచి 33 వేల రూపాయలవరకూ ఉన్నాయి. ప్రస్తుతం అన్ని కంపెనీలు పోర్టబుల్‌ ఏసీలను అందుబాటులో ఉంచాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో

5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి

పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??

విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!

Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??

 

Published on: Mar 25, 2023 09:50 AM