Bank Holidays April 2023
మరో ఆరు రోజుల్లో ఈ నెల ముగియనుంది. అలాగే మార్చి 31వ తేదీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంకారణంగా బ్యాంకుల పనిదినాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పండుగలు, వారాంత సెలవులతో కలిపి ఏప్రిల్ నెలలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుల్లో ఆర్థికలావాదేవీలు సకాలంలో పూర్తి చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. వచ్చే నెలలో బ్యాంకు పనులపై వచ్చే వినియోగదారులు, ఉద్యోగాలు, ఇతర ముఖ్యమైన పనులు ఉన్నవాళ్లు ముందుగానే తమ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలంటే బ్యాంకు పని దినాల గురించిన సమాచారం తెలుసుకుని ఉండాలి. బ్యాంకు నియమాల ప్రకారం.. నెలలో మొదటి, మూడో శనివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారంతోపాటు అన్ని ఆదివారాలు సెలవులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వీటితో పాటు ప్రాంతీయ సెలవుల కారణంగా పని దినాల్లో కూడా బ్యాంకు మూసివేసే అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ నెలలో 1, 2, 4, 5, 7, 8, 9, 14, 15, 16, 18, 21, 22, 23, 30 తేదీలలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. సెలవు దినాల్లో కూడా ఏటీఎంలు, నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యాథావిథిగా కొనసాగుతూనే ఉంటాయి. బ్యాంకు కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2023లో ప్రకటించిన బ్యాంక్ సెలవుల లిస్టు ఇదే..
ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..
- ఏప్రిల్ 1వ తేదీన నూతన ఆర్థిక ఏడాది ప్రారంభమవుతున్న కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ రోజును యాన్యూవల్ క్లోజింగ్ డేగా పరిగణిస్తారు. ఐతే ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, చండీగఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయి.
- ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం
- ఏప్రిల్ 4వ తేదీన మహవీర్ జయంతి
- ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్‌జీవన్ రామ్ జయంతి
- ఏప్రిల్ 7వ తేదీన గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 8వ తేదీన రెండో శనివారం
- ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం
- ఏప్రిల్ 14 వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి
- ఏప్రిలే 15వ తేదీన విషు, బొహాగ్, బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తలా, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, షిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు
- ఏప్రిల్ 16వ తేదీన ఆదివారం
- ఏప్రిల్ 18వ తేదీన షాబ్ ఇ కబర్ కారణంగా జమ్ము అండ్ శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
- ఏప్రిల్ 21వ తేదీన ఈద్ ఉల్ ఫితర్ పండగ కావడంతో అగర్తలా, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
- ఏప్రిల్ 22వ తేదీన నాలుగో శనివారం
- ఏప్రిల్ 23వ తేదీన ఆదివారం
- ఏప్రిల్ 30వ తేదీన ఆదివారం
- ఏప్రిల్ 2023 నెలలో బ్యాంకులు సెలవుల గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. బ్యాంకు లావాదేవీలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అవాతరాలు ఏర్పడకుండా చూసుకునేందుకు వీలుంటుంది. ఈ రోజుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ సేవలు, ఏటీఎం సేవలు, యూపీఐ వంటివి అందుబాటులో ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.