బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బంగారం ధరలు షాక్ కొట్టేలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు.. శనివారం మరోసారి భారీగానే పెరిగింది. తులంపై ఏకంగా రూ. 250 పెరగడం గమనార్హం.
ఏప్రిల్‌లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయన్న వార్తలకు ఇది ఊతమిచ్చినట్లైంది. ఇక దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,840 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 వద్ద నమోదైంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.58,420 వద్ద ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,470 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690 ఉంది.
బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం దేశంలో కిలో వెండిపై రూ. 600 వరకు పెరిగింది. శుక్రవారం చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100, ముంబైలో రూ.69,800, ఢిల్లీలో రూ.69,800, కోల్‌కతాలో కిలో వెండి రూ.69,800, బెంగళూరులో రూ.73,100, హైదరాబాద్‌లో రూ.73,100, విశాఖ, విజయవాడలో రూ.73,100 వద్ద ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..