PIB Fact Check: దేశంలోని కోట్లాది మంది యువతకు మోడీ ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా..?

|

Mar 18, 2023 | 5:40 AM

డిజిటల్ ఇండియా మిషన్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు చాలా మందికి అవసరం అయ్యాయి. గతంలో కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరపున ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ..

PIB Fact Check: దేశంలోని కోట్లాది మంది యువతకు మోడీ ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా..?
Laptop
Follow us on

డిజిటల్ ఇండియా మిషన్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు చాలా మందికి అవసరం అయ్యాయి. గతంలో కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరపున ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ నోటీసు వైరల్ అవుతోంది. ఈ వైరల్ నోటీసులో భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందని పేర్కొంటున్నారు.

‘ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ 2023’ కింద ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నట్లు మెసేజ్‌లో క్లెయిమ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్‌కు సంబంధించి PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఈ క్లెయిమ్ పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పింది. మీకు అలాంటి సందేశం ఏదైనా వచ్చినట్లయితే మీరు దాని వాస్తవికతను తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వైరల్ మెసేజ్‌ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేయడంతో అలాంటి స్కీమ్ ఏదీ అమలు కావడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవ తనిఖీ ఆధారంగా విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా అలాంటి పథకం అమలు చేయడం లేదని ఫ్యాక్ట్‌ చెక్‌ తెలిపింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దని ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకర్ ‘PIB ఫాక్ట్ చెక్’ ప్రజలను కోరింది.

అటువంటి తప్పుదోవ పట్టించే సందేశాలను ఫార్వార్డ్ చేయకుండా నిషేధించింది. ఈ క్లెయిమ్ పూర్తిగా ఫేక్ అని పై మెసేజ్ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. అలాంటి ఉత్తర్వులేవీ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది.

 

వైరల్ సందేశంలో ఏముంది?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశంలో, యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. 11, 12, BA తరగతుల ప్రతి సెమిస్టర్ విద్యార్థులకు ‘ప్రధానమంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2023’ కింద ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు ఈ నోటీసులో ఉంది. ఇందులో ల్యాప్‌టాప్ ఫీచర్ల గురించి కూడా ప్రస్తావించారు. ఏదీ ఏమైనా ఇలా వైరల్‌ అవుతున్న సందేశంలో ఎలాంటి వాస్తవం లేదని పీఐబీ స్పష్టం చేసింది. సో.. మీరు కూడా ఇలాంటి సందేశాలను చూసినట్లయితే నమ్మి మోసపోకండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి