Business Ideas: ఎకరం పొలం ఉంటే చాలు.. ఈ సాగుతో రూ. 50 లక్షల వరకు ఆదాయం.. అదేంటంటే!
రైతులకు వ్యవసాయ భూమే స్వర్గధామ. పగలూ రాత్రి అనేది తేడా లేకుండా ప్రతీ సాగుకు కష్టపడి పని చేస్తారు. ఇక వారిని ధనవంతులు చేసేందుకు..
రైతులకు వ్యవసాయ భూమే స్వర్గధామ. పగలూ రాత్రి అనేది తేడా లేకుండా ప్రతీ సాగుకు కష్టపడి పని చేస్తారు. ఇక వారిని ధనవంతులు చేసేందుకు బెస్ట్ పంట డ్రాగన్ ఫ్రూట్. ఈ పండును మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. ప్రమాణాలకు అనుగుణంగా ఈ పంటను సాగు చేస్తే.. అద్భుత ఆదాయాలను పొందొచ్చు. తొలిదశ సాగుకు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా 400 గ్రాముల బరువు ఉంటుంది. ఒక చెట్టుకు కనీసం 50-60 డ్రాగన్ ఫ్రూట్స్ పండుతాయి. దేశంలో ఈ పండ్ల ధర కిలో రూ. 200 నుంచి రూ. 250 వరకు ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎకరం భూమి ఉంటే.. సుమారు 1700 డ్రాగన్ ఫ్రూట్ చెట్లను నాటవచ్చు. ఇలా సంవత్సరానికి రూ. 50 నుంచి రూ. 70 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు. తక్కువ వర్షపాతం ఉన్నా.. నేల నాణ్యత సరిగ్గా లేకపోయినా ఈ పండు బాగా పెరుగుతుంది. దీని సాగుకు ఇసుక నేల, మంచి సేంద్రియ పదార్ధం ఎంతో ఉపయోగకరం.