EPFO ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అధిక పెన్షన్‌ కోసం మరో అవకాశం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది.

EPFO ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అధిక పెన్షన్‌ కోసం మరో అవకాశం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
EPFO
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2023 | 6:50 AM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అర్హులైనవారు అధిక పింఛను పొందేందుకు ఈ వెసలుబాటు తీసుకొచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం -1995 చట్టసవరణకు ముందుగా ఈపీఎఫ్‌ చందాదారుగా చేరినవారు. వీరితో పాటు.. మరికొందరు కూడా ఇందుకు అర్హులుగా పేర్కొంది. చందాదారులుగా చేరి.. ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందాచెల్లిస్తూ కూడా ఈపీఎస్‌ చట్టంలోని 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన వారు అర్హులుగా తేల్చి చెప్పింది. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు గడువును మే 3గా పేర్కొంది. ఈ గడువులోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతనజీవులు ఉమ్మడి ఆప్షన్‌ నమోదు చేయాలని స్పష్టం చేసింది.

ఇంతకీ ఇందులోని ఆప్షన్లేవీ? అంటే వేతనజీవులు, పింఛనుదారులు ఈపీఎఫ్‌ మెంబర్‌పోర్టల్‌ హోంపేజీలో ప్రత్యేక లింకును ఈపీఎఫ్‌వో ఆదివారం అర్ధరాత్రి ఏర్పాటు చేసింది. హోంపేజీలో అప్లికేషన్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌ లింకును క్లిక్‌ చేయాలి. ఆ తరువాత ఈపీఎస్‌ చట్టం 11(3) కింద ఆప్షన్‌కు దరఖాస్తును క్లిక్‌ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు ఖాతాద్వారా పూర్తిచేయాలి. చందాదారు ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఈపీఎఫ్‌వో రికార్డుల ప్రకారం నమోదు చేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరు తప్పనిసరిగా ఉండాలి. నాలుగు దశల్లో వివరాలు పూర్తిచేశాక దరఖాస్తు నంబరు వస్తుంది. ఆ తర్వాతి వీరు అధిక ఫించన్ పొందేందుకు మార్గం సుగమం అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి