Electric Bike: మూడు సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌.. ఇది మామూలు ఈ-బైక్‌ కాదు! ఫీచర్లు కూడా అదిరిపోయాయి..

అయితే ఇప్పటి వరకూ వచ్చిన ఎలక్ట్రిక్‌ బైక్‌ అన్నింటి రేంజ్‌ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చైనా చెందిన ఓ కంపెనీ స్పోర్ట్స్‌ మోడల్‌లో హై స్పీడ్ బైక్ ను ఆవిష్కరించింది. ఇటీవల యూకే మార్కెట్లోకి లాంచ్‌ చేసిన ఆ కంపెనీ ఇప్పుడు యూఎస్‌ మార్కెట్‌పై కన్నెసింది.

Electric Bike: మూడు సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌.. ఇది మామూలు ఈ-బైక్‌ కాదు! ఫీచర్లు కూడా అదిరిపోయాయి..
Davinci Motor DC 100
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 31, 2022 | 5:13 PM

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తోంది. అటు కార్లు, ఇటు ద్విచక్రవాహనాలు విరివిగా మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలతో పాటు పలు స్టార్టప్‌ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ బైక్‌ ల తయారీలో ముందుంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ఎలక్ట్రిక్‌ బైక్‌ అన్నింటి రేంజ్‌ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చైనా చెందిన ఓ కంపెనీ స్పోర్ట్స్‌ మోడల్‌లో హై స్పీడ్  బైక్‌ను ఆవిష్కరించింది. ఇటీవల యూకే మార్కెట్లోకి లాంచ్‌ చేసిన ఆ కంపెనీ ఇప్పుడు యూఎస్‌ మార్కెట్‌పై కన్నేసింది. ఇంతకీ ఆ బైక్‌ ఏంటి? దాని ఫీచర్లు ఏంటి? అది ఏ కంపెనీకి చెందినది వంటి వివరాల కోసం ఈ కథనం చదవండి..

చైనాకు చెందిన డావిన్సీ కంపెనీ..

చైనాకు చెందిన రోబోటిక్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్స్‌ తయారీదారైన డావిన్సీ తన డీసీ100 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని యూనైటెడ్‌ నేషన్స్‌ లో నిర్వహించే కన్‌స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో(సీఈఎస్‌)-2023కి ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ బైక్‌ని యూకే మార్కెట్లోకి విడుదల చేసిన దాని తయారీదారులు.. తొలి సారిగా యూఎస్‌ మార్కె‌ట్‌ను టార్గెట్‌ చేశారు.

మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్‌..

డావిన్సీ డీసీ100 ఈ-బైక్‌ 1000 సీసీ ఇంజిన్‌తో రానుంది. ఇది కేవలం మూడు సెకన్లలోనే 0 నుంచి 100 kmph స్పీడ్‌ అందుకోవడంతో పాటు, 200 kmph టాప్‌ స్పీడ్‌లో దూసుకుపోతుంది. బ్యాటరీ కూడా ఒకసారి చార్జ్‌ చేస్తే 400 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. 3డీసీ ఫాస్ట్‌ చార్జింగ్‌ తో అరగంటలో బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అవుతుంది. ఈ సందర్భంగా డావిన్సీ మోటార్‌ ఇంటర్‌నేషనల్‌ బిజినెస్‌ మేనేజర్‌ రొసన్నా లిబియా మాట్లాడుతూ యూఎస్‌ లో తమ మొట్టమొదటి బైక్‌ను ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామన్నారు. యూఎస్‌ సీఈఎస్‌-2023లో తమ మోడల్‌ ప్రదర్శించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్‌ డ్రా చేయడానికి దీనిని ఒక వేదికగా ఉపయోగించుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..