Car Insurance: మీరు కొత్త కారు కొనుగోలు చేశారా..? అయితే ఈ పని వెంటనే చేయండి.. అదేంటో తెలుసా..?

కొత్త కారు కొనుగోలు చేసే ముందు ఎన్నో ఆలోచనలు చేసి తీసుకోవాలి. కారు కొనుగోలు చేసిన తర్వాత కారు మెయింటెన్‌ నుంచి ఇన్సూరెన్స్‌ వరకు సరిగ్గా ఉండాలి. కారుకు సంబంధించి అన్ని పత్రాలు కూడా ఉండటం తప్పనిసరి. కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత వెంటనే ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ముఖ్యం. ఇన్సూరెన్స్‌లో కూడా రకరకాలుగా ఉంటాయి..

Car Insurance: మీరు కొత్త కారు కొనుగోలు చేశారా..? అయితే ఈ పని వెంటనే చేయండి.. అదేంటో తెలుసా..?
New Car
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2023 | 8:13 PM

కార్ల విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి నిత్యం కార్లను కొనుగోలు చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. అదే సమయంలో కారు కొనుగోలు చేసిన తర్వాత దానిని మెయింటెన్‌ చేయడం కూడా ముఖ్యమే. మీరు కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత ఈ పని వెంటనే చేయాలి. తద్వారా మీ డబ్బు ఆదా అవుతుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు కారు బీమా ఎంపిక చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు సరైన కారు బీమాను ఎంచుకుంటే అది మీ డబ్బును ఆదా చేస్తుంది. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్:

కారు కొనుగోలుతో పాటు ప్రజలు కారు బీమా తీసుకోవడం కూడా అవసరం. ప్రమాదం జరిగినప్పుడు కారుకు కలిగే నష్టాన్ని బీమా ద్వారా భర్తీ చేయవచ్చు. మరోవైపు మీ కారుకు బీమా లేకపోతే జరిమానా కూడా విధించవచ్చు. అటువంటి పరిస్థితిలో థర్డ్ పార్టీ బీమా పొందడం చాలా ముఖ్యం.

అవసరాన్ని బట్టి పాలసీని కొనండి:

ఏ పాలసీని గుడ్డిగా ఎంచుకోవద్దు. మీరు ఎల్లప్పుడూ మీ అవసరానికి అనుగుణంగా పాలసీని ఎంచుకోవాలి. మీరు ఎవరి నుంచి కారును కొనుగోలు చేస్తున్నారో వారి ద్వారా అనేక పాలసీలు మీకు తెలుసుకోవచ్చు. వారు ఖరీదైన పాలసీని తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. అయితే ముందుగా మీరు మీ అవసరాన్ని బట్టి ఏ పాలసీని తీసుకోవాలనే దాని గురించి ఆలోచించాలి. అప్పుడే మీరు చౌకైన, మంచి, తక్కువ ప్రీమియంతో సరైన పాలసీని ఎంచుకోగలుగుతారు.

ఇవి కూడా చదవండి

మరింత కవరేజ్

మీరు కొత్త కారును కొనుగోలు చేసినట్లయితే మీరు సమగ్ర మోటార్ బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ కింద వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి విపత్తుల వల్ల కలిగే నష్టాల వల్ల కూడా కవరేజీ పొందవచ్చు. ఈ పాలసీ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి