బడ్జెట్ 2024-25 హైలెట్స్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయ్యాక వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మోదీ ప్రభుత్వంపై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు భారీ అంచనాలతో ఉన్నారు. ఆదాయపు పన్ను విధానంలో మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే పన్ను రాయితీ, కొత్త పన్ను విధానంలో కూడా సడలింపు ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సమీప భవిష్యత్తులో భారత్ మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది బడ్జెట్‌లో అందరికి మేలు జరిగే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది బడ్జెట్‌లో కార్మికవర్గంతోపాటు వ్యవసాయం, మహిళలు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ మధ్యతరగతి, సామాన్యులు, కార్పొరేట్, రైతు, సేవా రంగం, వ్యవసాయం, రైల్వే సేవలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఈ అన్ని రంగాలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? బడ్జెట్‌లో ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుంది? కొత్తగా ఎలాంటి ప్రకటనలు చేశారు? ఏది చౌకగా మారింది? ఏది ఖరీదైనది? తదితర అంశాలపై పూర్తి వివరాలు అందిస్తున్నాము.

Read More