Big News Big Debate: ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. చివరలో చిన్న ట్విస్ట్..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని బీజేపీ, నిందితులు వేసిన పిటిషన్ విచారించిన..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని బీజేపీ, నిందితులు వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. బీజేపీ వేసిన పిటిషన్ తిరస్కరించిన బెంచ్.. నిందితుల వాదనతో మాత్రం ఏకీభవించింది. సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదని అభిప్రాయపడిన కోర్టు దర్యాప్తును CBIకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ విచారణలోని అంశాలు CBIకి అప్పగించాలని కూడా ఆదేశించింది.
మొత్తానికి బీజేపీ మొదటి నుంచి కోరుకుంటున్నట్టు ఈ వ్యవహారం రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్రం దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లింది. వివిధ రాష్ట్రాలు పర్యటించి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సిట్ BL సంతోష్ వంటి బీజేపీ అగ్ర నాయకులకు కూడా నోటీసులు ఇచ్చింది. తీర్పుతో కేసు CBI చేతికి పోనుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం వద్దకు వెళ్లాలని సలహా ఇస్తున్నారు మాజీ అధికారులు.
దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చిన హైకోర్ట్.. తీర్పు తుది కాపీ వచ్చే వరకు జడ్టిమెంట్‌ను సస్పెన్షన్‌లో పెట్టింది. పైనల్ కాపీ వచ్చే దాకా ఆర్డర్‌ను సస్పెన్షన్‌లో పెట్టాలని అడ్వకేట్ జనరల్ విఙ్ఞప్తి చేశారు. రేపు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.