Meena Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఫలితాలు ఇలా..

Meena Rasi Ugadi Rasi Phalalu 2023: తెలుగువారి నూతన సంవత్సర కాలంలో మీన రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

Meena Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఫలితాలు ఇలా..
Meena Rasi Ugadi Rasi Phalalu 2023Image Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2023 | 6:42 AM

తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు.  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది.  మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో మీన రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం 8, వ్యయం 11 | రాజపూజ్యం 1, అవమానం 2
వ్యయంలో శని, రెండవ స్థానంలో గురు రాహులు అష్టమంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. అనవసర ఖర్చుల్ని విలాసాలను బాగా తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది.
ఆధ్యాత్మిక చింతనలో పురోగతి సాధిస్తారు. తీర్థ యాత్రలకు వెళతారు. ఆలయాలు సందర్శిస్తారు. కళా రంగంలో లేదా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ పరంగా ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒంటెద్దు పోకడ వల్ల సమస్యల్లో ఇరుక్కుంటారు. పిల్లల కారణంగా సంతోషంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.

ఏప్రిల్ నుంచి అనుకూలం 

ఉద్యోగ పరంగా బదిలీ లేదా స్థాన చలనానికి అవకాశం ఉంది. గృహ యోగానికి అవకాశం ఉంది. స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఆర్థిక స్థితిలో మార్పు చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఎటువంటి మార్పును ఆశించకుండా యధాతధ స్థితిని కొనసాగించడం మంచిది. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకొని అవకాశం ఉంది.
పరిహారాలు
ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ పరంగా కూడా ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అధికారులతో అతి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. బంధు మిత్రులతో ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోవడం ప్రస్తుతానికి మంచిది కాదు. వినాయకుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..