8.30 గంటల్లోనే సికింద్రాబాద్ టూ తిరుపతి.. ఆగేది 4 స్టాప్‌లు, టైమింగ్స్ వివరాలివే! ఏప్రిల్ 9 నుంచి..

శ్రీవారి భక్తులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందేభారత్ రైలు వచ్చేస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి..

8.30 గంటల్లోనే సికింద్రాబాద్ టూ తిరుపతి.. ఆగేది 4 స్టాప్‌లు, టైమింగ్స్ వివరాలివే! ఏప్రిల్ 9 నుంచి..
Vande Bharat Express
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 31, 2023 | 10:00 AM

శ్రీవారి భక్తులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందేభారత్ రైలు వచ్చేస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఆ రోజు ప్రయాణీకులకు అనుమతి ఉండదు. వారికి ఏప్రిల్ 9(ఆదివారం)న తిరుపతి నుంచి, ఏప్రిల్ 10న సికింద్రాబాద్ నుంచి ఈ వందేభారత్ అందుబాటులో వస్తుంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రయాణ సమయం దాదాపు 12 గంటలు కాగా.. ఇక మీదట వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఆ ప్రయాణ సమయం 8.30 గంటలు కానుంది.

మొదటి రోజు(ఏప్రిల్ 8) ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై.. తిరుపతికి రాత్రి 9 గంటలకు చేరుతుంది. ఈ ట్రైన్ మంగళవారం మినహా.. వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఈ వందేభారత్ టికెట్ ఛార్జీలు ఇంకా రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. అయితే గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించిన సమయాలివే..

సికింద్రాబాద్-తిరుపతి(20701):

సికింద్రాబాద్ – ఉదయం 6.00 గంటలకు

నల్గొండ – ఉదయం 7.19 గంటలకు

గుంటూరు – ఉదయం 9.45 గంటలకు

ఒంగోలు – ఉదయం 11.09 గంటలకు

నెల్లూరు – ఉదయం 12.29 గంటలకు

తిరుపతి – మధ్యాహ్నం 2.30 గంటలకు

తిరుపతి – సికింద్రాబాద్(20702):

తిరుపతి – మధ్యాహ్నం 3.15 గంటలకు

నెల్లూరు – సాయంత్రం 5.20 గంటలకు

ఒంగోలు – సాయంత్రం 6.30 గంటలకు

గుంటూరు – రాత్రి 7.45 గంటలకు

నల్గొండ – రాత్రి 10.10 గంటలకు

సికింద్రాబాద్ – రాత్రి 11.45 గంటలకు