MLC Election: క్రాస్ ఓటింగ్ వేశారా..? ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నోటి నుంచి వచ్చిన ఆన్సర్ ఇదే

ఎవరు.. ఆ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు..? వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 23, 2023 | 9:37 PM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకు షాక్‌ తగిలింది. వైసీపీ నేతలు మెుదటి నుంచి తాము 7 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుంటామని చెప్పినప్పటికీ.. ఆత్మప్రబోధం మేరకు వేసిన ఓట్లతో వైసీపీ ఏడో అభ్యర్థిని గెలవలేకపోయింది. 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనుహ్య విజయం సాదించారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా వచ్చింది. అయితే ఆమె తాజాగా ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను అలాంటి చర్యకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తనకు జగన్ నుంచి హామి లభించిందని.. ఓటింగ్‌కు ముందు కూడా ఆయన్ను కలిసి వచ్చినట్లు తెలిపారు.