Hail Storm: తెలుగు రాష్ట్రాల్లో మిసైల్ దాడిలా వడగళ్ల వాన.. అకాల వర్షాలతో భారీగా పంట నష్టం..

అవి రాళ్లా..? వడగళ్లా..? ఆకాశం నుండి కుప్పలు తెప్పలుగా పడుతుంటే జనం బెంబెలెత్తిపోయారు. తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.  

Hail Storm: తెలుగు రాష్ట్రాల్లో మిసైల్ దాడిలా వడగళ్ల వాన.. అకాల వర్షాలతో భారీగా పంట నష్టం..
Hailstorm
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2023 | 6:49 AM

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. వికారాబాద్‌జిల్లా మర్పల్లి మండలం గుడ్లమర్పల్లిలో వడగళ్ల వాన కురిసింది. ఆకాశం నుండి రాకెట్‌ మిస్సైల్‌ దాడిలా అనిపించింది. అకాల వర్షానికి పలుచోట్ల భారీగా పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, విశాఖ, కడప, కర్నూలు, గుంటూరు, అనంతపురంజిల్లాలో భారీ వర్షం కురిసింది. పుట్టపర్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. కదిరిలో వడగళ్ల వాన బీభతసం సృష్టించింది. కొన్నిచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కడపజిల్లాలోని పులివెందుల, ఆళ్లగడ్డలో మామిడి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. నంద్యాలజిల్లాలో పలుచోట్ల వడగళ్లవాన కురిసింది. బనగానపల్లె, కోవెలకుంట్ల మండలాల్లోని వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మిరప, వరి పంటలు దెబ్బతిన్నాయి. మామిడి పిందెలు రాలిపోయాయి.. కల్లాల్లో ఎండబెట్టిన మిర్చి తడిసిపోయింది.

హైదరాబాద్‌ సిటీలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి.  పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీవర్షానికి నగరంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అటు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్ల వాన పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..