Andhra Pradesh: ఏపీ స్పీకర్ నిజంగా అలా చేశారా? టీడీపీ నేతల సంచలన ఆరోపణలు..

| Edited By: Ravi Kiran

Mar 28, 2023 | 8:11 AM

ఏపీ స్పీకర్ ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారా? తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించారా? టీడీపీ ఆరోపణలేంటి? ఆ పార్టీ నేతల డిమాండ్లేంటి? ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది టీడీపీ. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి 3 సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందారని..

Andhra Pradesh: ఏపీ స్పీకర్ నిజంగా అలా చేశారా? టీడీపీ నేతల సంచలన ఆరోపణలు..
Speaker Tammineni Sitaram
Follow us on

ఏపీ స్పీకర్ ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారా? తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించారా? టీడీపీ ఆరోపణలేంటి? ఆ పార్టీ నేతల డిమాండ్లేంటి? ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది టీడీపీ. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి 3 సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందారని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు. తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు కూన రవికుమార్. డిగ్రీ మధ్యలోనే వదిలేసిన తమ్మినేని సీతారాం ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సులో ఎలా అడ్మిషన్ పొందారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నారు రవి కుమార్. అనేక టీవీ ఇంటర్వ్యూలలోనే డిగ్రీ డిస్ కంటిన్యూ చేసినట్లు తమ్మినేని స్వయంగా చెప్పారన్నారు.

2019లో ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి తమ్మినేని సీతారాం పోటీ చేసినప్పుడు.. అఫిడవిట్లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని అఫిడవిట్లో ధృవీకరించారన్నారు రవి కుమార్. ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్ కంటిన్యూస్ గా ప్రకటించిన తమ్మినేని.. అదే ఏడాది ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ పొందడం ఎలా సాధ్యమైందన్నారు. తమ్మినేని సీతారాం సర్టిఫికెట్ ఫోర్జరీ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సీతారాంకి విలువలు ఉంటే తక్షణమే పదవికి రాజీనామా చేయాలనీ కూడా రవికుమార్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..